ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు (సర్) సంబంధించిన ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎలెక్టోరల్ అధికారి కె. వెట్రిసెల్వి శుక్రవారం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో విడుదల చేశారు.
ఏలూరు, జులై, 31 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు (సర్) సంబంధించిన ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎలెక్టోరల్ అధికారి కె. వెట్రిసెల్వి శుక్రవారం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో విడుదల చేశారు. వివిద రాజకీయపక్షాల ప్రతినిధులకు ముసాయిదా జాబితా పెన్ డ్రైవ్ (సాఫ్ట్ కాపీ) లను కలెక్టర్ వెట్రిసెల్వి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓ) జూన్ 15 నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాలు నింపిన పత్రాల సేకరణ, వాటి డిజిటైజేషన్ చేపట్టారని, జిల్లా వ్యాప్తంగా 16, 44, 193 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1, 02, 542 మందిని తొలగించాల్సిన జాబితాలో చేర్చారని, . క్షేత్రస్థా యిలో బీఎల్వీలు పరిశీలించినప్పుడు ఆయా చిరునామాల్లో లేని వారి వివరాలు, ఆచూకీ లభ్యం కాని, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండేసి ఓట్లు ఉన్న వ్యక్తులు, మృతుల పేర్లను.. తొలగించాల్సిన జాబితా (ఏఎస్ఈడీ)లో చేర్చారన్నారు. . ఈ పేర్లేవీ ముసాయిదా జాబితాలో ఉండవన్నారు. . ఏఎస్ఈడీ పేరిట విడిగా జాబితాను రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లకు అందజేస్తారని, ఇవి కాకుండా మొత్తం 15,41,650 మంది ఓటర్లు మరియు 651 మంది సర్వీస్ ఓటర్ల వివరాలతో ముసాయిదా జాబితా విడుదల చేశామన్నారు. ఏఎసీడీ జాబితా, ముసాయిదా జాబితా ల్లోని వివరాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే శుక్రవారం నుంచి ఆగస్టు 31 వరకూ క్లెయిమ్లు దాఖలు చేసుకోవచ్చని, కొత్తగా ఓటు నమోదు, చిరునామాల్లో మార్పులు, తప్పుల సవరణ, అనర్హుల పేర్లు జాబితా నుంచి తొల గింపు వంటి వాటి కోసం ఈ నెల రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. వాటిని ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 28 వరకూ వీటిని పరిశీలిస్తారని కలెక్టర్ చెప్పారు. అర్హతలు ఉంటే తుది జాబితాలో పేరు చేరుస్తారని, అనర్హులుగా తేలితే తొలగిస్తారన్నారు. అనంతరం అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారన్నారు. ” వివరాలు నింపి ఎన్యూమరేషన్ పత్రాలు బిఎల్ఓ లకు సమర్పించిన వారి లోనూ చాలా మంది 2002 నాటి జాబితాలో తమ, తమ సంబంధీకుల వివరాలతో మ్యాపింగ్ చేసుకోలేదన్నారు.. అలాంటి వారికి నోటీసులిస్తారని, వీరు ఆధార్ కార్డు కాకుండా.. ఎన్నికల సంఘం నిర్దేశించిన 1. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డు లేదా పింఛను పేమెంట్ ఆర్డర్. 2. 1987 జులై 1కు ముందు ప్రభుత్వ/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్టాఫీసు/ ఎల్ఎసీ/ పీఎస్ యూలు జారీ చేసిన గుర్తింపు పత్రాలు. 3. జనన ధ్రువీకరణ పత్రం. 4. బోర్డు/విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యా సర్టిఫి కెట్లు. 6. శాశ్వత నివాస ధ్రువీకరణ. 7. అటవీ హక్కుల చట్టం సర్టిఫికెట్. 8. కుల ధ్రువీకరణ. 9. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (అమల్లో ఉన్న ప్రాంతాల్లోనే) 10. రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన ఫ్యామిలీ రిజిస్టర్. 11. ప్రభుత్వం జారీ చేసిన భూమి/ ఇంటి కేటాయింపు పత్రాలు వంటి 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ శ్రీదేవి, వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఎ. రత్నకాంత్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) , నెర్సు నెలరాజు, భారతీయ జనతా పార్టీ (BJP), డి.ఎన్.వి.డి. ప్రసాద్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) [CPI(M)], కె. శ్రీనివాస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) [CPI(M)], అచ్యుత బాబు, తెలుగుదేశం పార్టీ (TDP) , మోరు వెంకట నాగరాజు, జనసేన పార్టీ (JSP), ఎల్.బి. సుభాష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP), వి. స్టాలిన్ బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) , ఆర్. రామ్ మోహన్‌రావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC), కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.