ఔషదాలు, జీవిత, ఆరోగ్య భీమాలపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కలిగించాలి వ్యాసరచన, వ్రక్తృత్వ పోటీలు నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, అక్టోబర్, 8 : ఔషదాలు, జీవిత, ఆరోగ్య భీమాలపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం సాయంత్రం ‘సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్’ మూడవ వారం కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వినియోగించే ఔషదాలతోపాటు, కొన్ని ప్రధాన ఔషదాలు, జీవిత, ప్రమాద, ఆరోగ్య భీమాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించారని, వీటిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగించేందుకు జిలాల్లోని పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా ఆసుపత్రులలోను, మండల కేంద్రాలలోను అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా జీఎస్టీ ఫలాలు ద్వారా సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగం కలుగుతుంది అనే అంశంపై వ్యాసరచన, వ్రక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. నిర్వహించిన కార్యక్రమాలకు సంబందించిన ఫోటోలు, సమాచారం జీఎస్టీ వెబ్సైట్ లో పొందుపరచాలన్నారు.
మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.