Close

కలెక్టరేట్ లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ.. ప్లాస్టిక్ నిర్మూలన అందరి బాధ్యత.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 20/06/2026

ఏలూరు, జూన్ 20: ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో “ప్లాస్టిక్ రహిత సమాజం మరియు ఆపరేషన్ క్లీన్ స్వీప్” అనే థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ అధికారులు, సిబ్బందితో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిర్మూలనలో, వాడకం తగ్గించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్, ఇన్ చార్జి డిఆర్ఓ ఎల్. దేవకీదేవి, కలెక్టరేట్ ఏవో ఎన్. నాంచారయ్య, మెజిస్ట్రియల్ సెక్షన్ సూపరింటెండెంట్ పి. రవికుమార్ తదితర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.