కలెక్టర్లతో సిఎస్ వీడియో సమావేశం.. ఏలూరు కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, అక్టోబర్, 9 : జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పధకంలో ఎంపిక చేసిన గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు తెలియజేసారు. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన,సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ పధకాల పట్ల ప్రజల సంతృప్తి స్థాయి, పారిశుద్ధ్యం, ,ఎస్.సి., ఎస్టీ లపై దాడుల కేసులలో బాధితులకు పరిహారం. విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ల పునః పరిశీలన, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసుపత్రులలో వైద్య సేవలు, తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ వెట్రిసెల్వి సీఎస్ కి వివరించారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పధకంలో జిల్లాలో 81 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, ఆయా గ్రామాలలో నిర్దేశించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పధకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పధకంలో ఎంపిక చేసిన గ్రామాలలో నిర్దేశించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలందేలా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. ఎస్.సి., ఎస్టీ లపై దాడుల కేసులలో బాధితులకు నిబంధనల మేరకు పరిహారం అందేలా చూడాలన్నారు.
డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లాపరిషత్ సీఈఓ శ్రీహరి, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, డిఎంహెచ్ఓ పి .జె. అమృతం, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు, సిపిఒ వాసుదేవరావు, ప్రభృతులు పాల్గొన్నారు.