కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కి ఘన స్వాగతం
ఏలూరు/పోలవరం, జనవరి, 11 : పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు శనివారం చైర్‌పర్సన్ రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వంలో ప్రాజెక్ట్ సైట్ కి చేరుకున్న కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2024-25) చైర్మన్, సభ్యులకు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ వెంకట ప్రతాప్ శివకిశోర్, జె. పి. ధాత్రిరెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడీ తో పాటు కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఖిరు మహ్తో, శ్రీమతి ధర్మశీల గుప్తా, లోక్ సభ సభ్యులు రీ షేర్ సింగ్ ఘుబాయా, రోడ్మల్ నగర్, జోయంత బసుమతరీ, నారాయణ్ దాస్ అహిర్వార్, శ్రీమతి సంజ్ఞ జాతవ్, సాగర్ ఈశ్వర్ ఖండ్రే, విశాల్ (దాదా) ప్రకాష్బాపు పాటిల్, మోహితే-పాటిల్ ధైర్యషీల్ రాజ్‌సిన్హ్ లను రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు జీవనదిగా ఉందని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తి అయ్యాయని మంత్రి రామానాయుడు కమిటీ కి వివరించారు. భారత ప్రధాని నరేంద్రమోది , రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యం నదుల అనుసంధానమని కమిటీ మంత్రి వివరించారు.
ఆర్ అండ్ ఆర్ కమీషనర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు నరసింహ మూర్తి, బి. రాంబాబు లు , పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మెంబెర్ సెక్రటరీ ఎం. రఘురాం, ఏ పి జెన్కో ఎండి కె.వి. ఎన్ . చంద్రశేఖర్, కేంద్ర జలసంఘం మెంబెర్ గోపాల్ సింగ్, మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎండి సిహెచ్.వి. సుబ్బయ్య, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఎం. వెంకటేశ్వర రావు, ఆర్డీఓ ఎం.వి. రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.