కేంద్ర సాధికార కమిటీ కమిటీ గౌరవ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, మెంబెర్ కార్యదర్శిలు డా. జె.ఆర్. భట్, జి. భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్, కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కొల్లేరు ప్రాంతంలో పర్యావరణం, కాలుష్యం, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రహదారులు,భవనాలు, ఏలూరు నగరపాలక సంస్థ, ఆర్ డబ్ల్యూఎస్, తదితర అధికారులతో సమీక్షించారు.

ఏలూరు, జూన్, 18 : కేంద్ర సాధికార కమిటీ కమిటీ గౌరవ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, మెంబెర్ కార్యదర్శిలు డా. జె.ఆర్. భట్, జి. భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్, కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కొల్లేరు ప్రాంతంలో పర్యావరణం, కాలుష్యం, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రహదారులు,భవనాలు, ఏలూరు నగరపాలక సంస్థ, ఆర్ డబ్ల్యూఎస్, తదితర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవ సభ్యులు చంద్రశేఖర్ గోయల్ మాట్లాడుతూ ఉప్పుటేరు లోకి కలిసే ఇరిగేషన్ డ్రైన్లు, డ్రైన్ల ద్వారా కొల్లేరులోకి వచ్చే కాలుష్యం నివారణకు తీసుకుంటున్న చర్యలు, డ్రైన్ల డీసిల్టింగ్ పై నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ నాగార్జునరావు ని కమిటీ సభ్యులు ఆదేశించారు. కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలో 47 నాన్-నోటిఫైడ్ డ్రైన్లు, కొల్లేరు 5వ కాంటూర్ అవతల 67 నోటిఫైడ్ డ్రైన్లు ఉన్నాయన్నారు. ఇవి అన్ని ఉప్పుటేరులో కలుస్తాయన్నారు. కొల్లేరు వన్యప్రాణి అభ్యరణ్యంగా ప్రకటించాక ముందు కొల్లేరు గ్రామాలలోని అంతర్గత రోడ్లు, గ్రామాలను కలిపే లింక్ రోడ్లు, ప్రస్తుతం వాటి నిర్వహణ, కొత్తగా నిర్మించిన, నిర్మించే రోడ్లపై మరియు కొల్లేరు అభయారణ్య పరిధిలో రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్వహణ లపై ఉన్న సమస్యలపై నివేదిక అందించాలని పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణమూర్తి ని కమిటీ సభ్యులు ఆదేశించారు. అనంతరం ఏలూరు నగరం పారిశుద్ధ్య వ్యర్దాలు, వ్యర్ధాల శుద్దీకరణ సామర్థ్యం, కొల్లేరులో కలిసే ఏలూరు నగరంలోని పారిశుద్ధ్య వ్యర్థాలు వివరాలపై నివేదిక సమర్పించాలని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ను కమిటీ సభ్యులు ఆదేశించారు. ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో 32 ఎంఎల్ డి వ్యర్థాలు విడుదల అవుతాయని, వీటిలో పారిశుద్ధ్య వ్యర్థాలు 7 ఎంఎల్ డి ఉంటాయన్నారు. 5 ఎంఎల్ డి వ్యర్ధాలను శుద్ధి చేసే ప్లాంట్ ఏలూరులో ఉన్నదన్నారు. మరో 50 ఎంఎల్ డి వ్యర్ధాలు శుద్దీకరణ ప్లాంట్ ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. మిగిలిన వ్యర్థాలు తమ్మిలేరు ద్వారా కొల్లేరు కలుస్తున్నాయని కమిటీ సభ్యులకు తెలియజేసారు. కొల్లేరు పరిధిలో పర్యావరణం , కాలుష్య పరిస్థితులు, చేపల పెంపకానికి వినియోగించే నీరు, త్రాగునీటి కాలుష్యం, పరిశ్రమల ద్వారా కొల్లేరులోకి వెళ్లే వ్యర్థాల కారణంగా కలిగే కాలుష్యం, తదితర వివరాలపై సవివరమైన నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు ను కమిటీ సభ్యులు ఆదేశించారు. కొల్లేరులో త్రాగునీరు, భూగర్భ జలాలు, డ్రైన్లలో కాలుష్యాలను ఎప్పటికప్పడు పరిశీలించడం జరుగుతుందని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు కమిటీ కి తెలియజేసారు. కొల్లేరులో ఎన్ని రకాల చేపల పెంపకం జరుగుతుంది, కాలుష్య నీటిలో ఉత్పత్తి అయ్యే చేపల వినియోగం కారణంగా అనారోగ్య సమస్యలు, చేపల పెంపకానికి వినియోగించే రసాయనిక ఎరువులు, పురుగుమందుల వివరాలు, వాటి కారణంగా కొల్లేరులో కలిగే కాలుష్యం, తదితర విషయాలపై నివేదిక సమర్పించాలని మత్స్య శాఖాధికారులను కమిటీ సభ్యులు ఆదేశించారు. మత్యశాఖ కమీషనర్ రమాశంకర్ నాయక్ మాట్లాడుతూ బుడమేరు ద్వారా విజయవాడ నగరంలోని వ్యర్థాలు కొల్లేరులో కలుస్తున్నాయని వివరించారు.
కమిటీ కోరిన సమాచారం ను సంబంధిత శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా కమిటీ కి త్వరితగతిన పంపాలని కమిటీ సభ్యులు ఆదేశించారు.
రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు డా. కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు,అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, అటవీ ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ అజయ్ కుమార్ నాయక్, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, డిఎఫ్ఓ లు శుభం, విజయ,డిఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతరం కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, మెంబెర్ కార్యదర్శిలు డా. జె.ఆర్. భట్, జి. భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్ లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దుశ్శాలువా, మెమెంటోలతో సత్కరించారు.