కోడిపందేలు నిర్వహించడం నేరం నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయండి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, జనవరి, 7 : కోడిపందేలు నిర్వహించడం నేరమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం కోడిపందాల నిషేధ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సంక్రాంతికి సమయంలో జిల్లాలో సంప్రదాయ ఇంకా చట్టవిరుద్ధమైన కోడిపందాలను నిరోధించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. ఆంధ్ర ప్రదేశ్ గేమింగ్ యాక్ట్, 1974, సెక్షన్ 9(1), సెక్షన్ 9(2) కోడిపందాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు డిస్ట్రిక్ట్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (డీఎస్పీసీఏ) చైర్మన్ గా జిల్లా కలెక్టర్ నిషేధం అమలుకు గాను పశుసంవర్థక శాఖ అధికారులు, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బృందాలు గ్రామ స్థాయిలో జరుగుతున్న కోడిపందేల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాయన్నారు. కోడిపందేలు నిర్వహించకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం, నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయడం చేస్తాయన్నారు. .
కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.టి.గోవిందరాజు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు డా.హర్ష, డా.జాహ్నవి , ప్రభృతులు పాల్గొన్నారు.