Close

గడువులోగా నాణ్యతతో కూడిన పరిష్కారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 18/11/2024

ఏలూరు, నవంబర్, 18: ప్రజా ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కారం కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 245 ధరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డిప్యూటీ కలెక్టర్లు, కె. భాస్కరరావు, ఎం. ముక్కంటి లతో కలిసి ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖా ముఖిగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ పోలీస్ కేసులకు సంబంధించి చట్టప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా పిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పరిష్కార వ్యవస్థలో అందిన ధరఖాస్తులను నిర్ధేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పిజిఆర్ఎస్ కార్యక్రమం ఉండాలన్నారు. ఫిర్యాదుదారులు విజ్ఞఫ్తులను అధికారులు క్షుణంగా పరిశీలించి రీఓపెనింగ్ లేకుండా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందని కలెక్టర్ సూచించారు.

అందిన అర్జీల్లో కొన్ని….

దెందులూరు మండలం గాలాయిగూడెం కు చెందిన అందే సత్యనారాయణ అర్జీనిస్తూ తమ భూమిని తమ్ముడు కొడుకులు ఆక్రమించుకున్నారని, కనుక తన భూమికి శాశ్వత భూమిహక్కు రక్షణ కల్పించి భూమిని రీసర్వే చేయించాలని కోరారు. ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురం కు చెందిన ఎ. శ్రీనివాసరావు అర్జీనిస్తూ తమ భూమి రీ సర్వేలో అసైన్డ్ భూమిగా ఆన్ చూపిస్తున్నదని ఈ దృష్ట్యా తిరిగి రీ సర్వే చేయించాలని కోరారు. ఏలూరుకు చెందిన జి. భువనేశ్వరీ అర్జీనిస్తూ తన భర్త శారీరకంగా తీవ్రంగా గాయపర్చారని, దీంతో హాస్పటల్ ను ఆశ్రయించానని అతనిపై కేసుపెట్టేందుకు మెడికో లీగల్ కేసు రికార్డు చేయాలని పోలీసులను కోరానని ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. ద్వారకా తిరుమల మండలం కొమ్మరకు చెందిన ఒక మహిళ అర్జీనిస్తూ తనను ఒక వ్యక్తి లైంగిక వేదింపులకు గురిచేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సెక్షన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.