గృహనిర్మాణ పనుల్లో నాణ్యత కనబరచాలి.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, నవంబర్, 14: పోణంగిలోని ఏలూరు అర్బన్ హౌసింగ్ లేఅవుట్ కాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా కాలనీలో నిర్మిస్తున్న హౌసింగ్ నిర్మాణ పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంబంధిత హౌసింగ్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. కాలనీలో నిర్మిస్తున్న హౌసింగ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలని ఆదేశించారు. ఇచ్చిన టార్గెట్ ప్రకారం సమయానికి గృహనిర్మాణ పనులను పూర్తిచేసే విధంగా హౌసింగ్ అధికారులు సంబంధిత ఏజెన్సీలు, కార్మికులతో పూర్తిచేసే విదంగా చర్యలు చేపట్టాలన్నారు. గృహనిర్మాణ పనులలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్ధానంలో ఉందనీ, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు మరింత చొరవచూపి ఎక్కువ గృహనిర్మాణ పనులను పూర్తిచేసేలాగా కృషి చేయాలన్నారు. రూప్ లెవల్ , బేస్ మెంట్ లెవల్, పూర్తిచేసిన గృహాలను కలెక్టర్ పరిశీలించారు. ఎస్ జిహెచ్ రుణాలు గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. ఒక గృహనిర్మాణానికి ఎన్నిరోజులు ఏవిధంగా విభజిస్తున్నారో అనేదానిమీద అధికారులను కలెక్టర్ ఆరా తీశారు. లబ్దిదారుల యం బుక్ ను, లేఅవుట్ మ్యాప్ ను కలెక్టర్ పరిశీలించారు. లేఅవుట్ లో మౌలిక వసతుల ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట హౌసింగ్ పిడి జి. సత్యనారాయణ, ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ భాను ప్రకాష్ , ఏలూరు తహశీల్దారు శేషగిరి, హౌసింగ్ ఇఇలు, ఏఇలు, సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.