గోనె సంచులు నాణ్యతలో ఎటువంటి రాజిలేదు
ఏలూరు,ఏప్రిల్ 12:ధాన్యం కొనుగోలులో భాగంగా, రైతులు ఉపయోగించే గోనె సంచులు నాణ్యతగా ఉండాలని, ఈ విషయంలో ఎటువంటి రాజీలేదని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి స్పష్టం చేశారు.
శనివారం స్థానిక గౌతమి సమావేశ మందిరంలో రబీ ధాన్యం కొనుగోలు పై రైస్ మిల్లర్లు,వ్యవసాయ, సివిల్ సప్లైస్,రవాణా,సహకార,మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2024-25 రబీ పంట కాలమునకు సంబంధించి ధాన్యం సేకరణ 02.04.2025 నుండి ప్రారంభమైందనీ, వ్యవసాయ శాఖ వారి అంచనాల ప్రకారం ధాన్యం 3.53 లక్షల మెట్రిక్ టన్నులు, లోగడ ప్రధాన కార్యాలయం ద్వారా ధాన్యం సేకరణ లక్ష్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించినట్లు తెలిపారు.తదుపరి రైతుల యొక్క శ్రేయస్సు కొరకు జిల్లా క్షేత్ర స్ధాయి అధికారుల అభ్యర్ధన మేర 2.00 లక్షల మెట్రిక్ టన్నులుగా పెంచడమైనదన్నారు. సదరు ధాన్యమును నాణ్యత నిబంధన మేరకు మేరకు ధాన్యం కొనుగోలు చేయుటకు ప్రణాళిక సిద్దం చేయడం జరిగిందన్నారు. రబి ధాన్యం సేకరణకు సుమారు 55 లక్షల గోరు సంచులు అవసరత ఉంటుందన్నారు.గోనె సంచులు కూడా రైతులకు అందుజేయుటకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో పెట్టుటకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నిర్దేశించిన రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న గోను సంచుల వివరాలు అందించాలన్నారు. అదేవిధంగా ఎక్కడైనా బాగాలేని గోనెసంచులు తిరస్కరించినప్పుడు సంబంధి వివరాలు తమకు సమర్పించాలన్నారు. ధాన్యo రవాణాలకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్ రెండింతల వేగవంతం చేయాలని రవాణా శాఖ అధికారులు ఆదేశించారు. 22 మండలాలలో సాగు చేసిన ధాన్యం సేకరణ కొరకు ఉన్న ఆర్.ఎస్.కె ల 241 అయితే ఈ 241 ఆర్.ఎస్.కె కేంద్రములను ధాన్యం సేకరణ కోసం తటస్థీకరణ (క్లస్టరింగ్) చేసిన అనంతరం ఉన్న సంఖ్య రైతులు 118 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ 118 ఆర్.ఎస్.కెలకు అనుసంధానం చేసిన 62 ప్రొక్యూర్‌మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీలు (PSAలు) 2024-25 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కనీస మద్దతు ధర ‘గ్రేడ్-ఎ’ రకము క్వింటాళ్ కు రూ.2320/- మరియు ‘కామన్’ రకము క్వింటాళ్ కు రూ.2300/- చొప్పున నిర్ణయించమైనదన్నారు. అవసరమైన సిబ్బందిని రైతు సేవా కెంద్రములలోని దాన్యం కొనుగోలు ఏజన్సిల ద్వారా నియమించమన్నారు.
కావున, రైతులు పండించిన ధాన్యమును కనీస మద్దతు ధరకు ప్రభుత్వం వారు ప్రారంభించిన రైతు సేవా కెంద్రములలోని దాన్యం కొనుగోలు ఏజన్సిల ద్వారా FAQ నిభంధనల ప్రకారం విక్రయించుకుని, ప్రభుత్వం వారు నిర్ణయించిన కనిస మద్దతు ధర పొందగలరు మరియు ధాన్యం కొనుగోలునకు సంబంధించి రైతులకు ఎటువంటి సందేహములు ఉన్నా మరియు వారి యొక్క ఫిర్యాదులను చేయుట కొరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ (కంట్రోల్ రూమ్ నెంబర్లు 08812-230448, 7702003584, 7569562076 మరియు 7569597910) నకు కాల్ చేయవచ్చునని తెలియజేశారు.
సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, డీఎస్ఓ ప్రతాపరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, డి శ్రీనివాస్,రైస్ మిల్లర్లు,వ్యవసాయ, సివిల్ సప్లైస్,రవాణా,సహకార,మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.