Close

గ్రామాల్లో 15 రోజులకు ఒకసారి అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను ప్రోత్సహించాలి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .

Publish Date : 26/09/2025

ఏలూరు,సెప్టెంబరు 26: జిల్లా కలెక్టరేటు గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగు ( ఏపిసియన్ యఫ్ ) ప్రకృతి వ్యవసాయంపై జాతీయ లక్ష్యం జిల్లాస్థాయి కన్వర్జెన్స్ సమావేశం, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు.

జిల్లాలో 2022- 23 లో 47,639 మంది రైతులు 50,487 ఏకరాలు, 2023-24 లో 53,664 మంది రైతులు 59,784 ఏకరాలు, 2024-25 లో 54,696 మంది రైతులు 54,817 ఏకరాలు, 2025-26 లో 59,325 మంది రైతులు 58,112 ఏకరాలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని జిల్లా ప్రాజెక్టు మేనేజరు ( పకృతి వ్యవసాయం), జిల్లా కలెక్టరుకు వివరించారు. జిల్లా కలెక్టరు స్పందిస్తూ 2024- 25 సాగు తగ్గటంపై అసహనం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింత విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం సాగు పెరిగే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్యసాధన చేయాలనీ ఆదేశించారు.

జిల్లా సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏలూరు జిల్లాను మొదటి లేక రెండవ స్థానంలో నిలిచేలా విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. జిల్లాలో పకృతి వ్యవసాయం ఏలా జరుగుతున్నాయో క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపడతానని, అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. జిల్లాలో 58 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుచేస్తున్నారని తెలిపారు. కషాయాలు వాడుతూ పురుగుల మందులు వాడకం తగ్గించడం శుభ పరిణామం తెలిపారు. 59,325 మంది రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి, ఖర్చు తగ్గించు కోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని, రైతులు అధిక లాభాలు సంపాదించవచ్చన్న విషయాన్నీ రైతులకు తెలియజేసి, మరింతమంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో సాగుచేసేలా ప్రోత్సహించాలన్నారు. డిపియం మరియు పకృతి వ్యవసాయ సహాయకులు మొత్తం ఏడు మంది 2026 సెప్టెంబరు ఖరీఫ్ నాటికి ఏడు గ్రామాలను పకృతి వ్యవసాయ గ్రామాలుగా ప్రకటించాలని, మిగతా గ్రామాల రైతులకు స్ఫూర్తి, జిల్లా పకృతి వ్యవసాయ ప్రగతి మరింత మెరుగు పడుతుందని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్.హబీబ్ భాషా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.సంతోష్, డిఆర్డిఏ పిడి ఆర్.విజయరాజు, డియంఐవో యస్.రామ్మోహన్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.బి.ప్రసాద రావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజరు బి.వెంకటేష్, డాట్ శాస్త్రవేత్త డా.కె.ఫణికుమార్, రైతులు, ప్రకృతి వ్యవసాయ సహాయకులు, సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.