Close

గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణులు సంతృప్తి చెందే స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి నిరుపేద ఇంటికి చేరాలి.

Publish Date : 04/12/2025

ఏలూరు, డిసెంబరు 04: స్థానిక శనివారంపేటలో గురువారం డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి 77 డివిజనల్ అభివృద్ధి అధికారి వారి (డిఎల్ డివో కార్యాలయాలు) కార్యాలయాలను వర్చువల్ గా ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంయుక్తంగా వీక్షించి, అనంతరం డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వర్చువల్ ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేసి, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణీలు సంతృప్తి చెందే స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి నిరుపేద ఇంటికి చేరాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని అన్నారు. కార్యాలయాలన్నీ ఒకే చోటకు చేర్చడం వలన మంచి పరిపాలన సౌలుభ్యంతో పాటు ప్రజలకు మంచిమేలు జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కనీస మౌలిక వసతులు కల్పనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిధులు సమకూర్చుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలక పాలనాపరమైన సంస్కరణలు చోటుచేసు కుంటున్నాయని, స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అందులో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డీడీఓ) కార్యాలయాలు ప్రారంభించుకునుట చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీలు పాలన సంస్కరణలు ఫలితాలు, ఫలాలు ప్రజలకు చేరాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, నిరుపేద లకు సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత అధికారులుపై ఉందని, మనస్సు పెట్టి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ శాఖ కమీషనరు ఓయస్డి, జిల్లా నోడల్ అధికారి కె.ఆనంద్, జిల్లా పరిషత్తు ఇంచార్చి సిఇవో కె.భీమేశ్వర రావు, ఏపిడి డ్వామా ఆర్,విక్టర్, డియర్డిఏ పిడి ఆర్.విజయరాజు, డియల్డివో ఏ.బి.పి.వి.లక్ష్మీ, డివిజనల్ పంచాయతీ అధికారి వై.అమ్మాజీ, సంబంధిత శాఖలు ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.