చట్టబద్ధమైన దత్తత ద్వారా పిల్లలు నీ దత్తత తీసుకోవడం అమ్మతనాన్ని ఆస్వాదించటం చాలా మంచి అనుభూతిని ఇస్తుందని రెండు నెలల క్రితం ఫ్రీ అడాప్షన్ పోస్టర్ కేర్ లో కుటుంబముల లోకి వెళ్ళిన ఇద్దరు బాలికల దత్తత తల్లిదండ్రులు ఈరోజు కలెక్టర్ వెట్రీసెల్వీ ముందు హాజరు
ఏలూరు, ఫిబ్రవరి, 13 : చట్టబద్ధమైన దత్తత ద్వారా పిల్లలు నీ దత్తత తీసుకోవడం అమ్మతనాన్ని ఆస్వాదించటం చాలా మంచి అనుభూతిని ఇస్తుందని రెండు నెలల క్రితం ఫ్రీ అడాప్షన్ పోస్టర్ కేర్ లో కుటుంబముల లోకి వెళ్ళిన ఇద్దరు బాలికల దత్తత తల్లిదండ్రులు ఈరోజు కలెక్టర్ వెట్రీసెల్వీ ముందు హాజరు అయి వారి మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రీ సెల్వీ మాట్లాడుతూ ఈ రెండు నెలలు కాలంలో పిల్లలు వారితో ఎలా ఉన్నది, పిల్లలు లేకముందు వారి కుటుంబ వాతావరణం ఎలా ఉన్నది అడిగి పిల్లల ప్రాధాన్యతల కొరకు ఎలాంటి మార్పులు చేసుకున్నది, వారి ఆలనా పాలనా చూసుకోవటానికి ఇంట్లో ఎవరెవరు ఉన్నారో, వారు ఈ దత్తత వెళ్లిన బాలల తో ఏ విధంగా ఉంటున్నది, వారి ఆహారపు అలవాట్లు గురించి చదివించడానికి చేస్తున్న ఏర్పాట్లు గురించి వివరంగా అడిగి తెలుసుకుని అన్నీ బాగా ఏర్పాటు చేసినారని నిర్ధారించిన తర్వాత తమిళనాడు రాష్ట్రానికి చెందిన దివ్యానంగం మరియు పద్మావతి దంపతులకు తేజశ్రీ అను పాప నీ, బేబీ మోక్షజ్ఞ మీనాక్షి అను పది నెలల వయస్సు గల పాపని . సెంథిల్ మరియు భానుప్రియ అను దంపతులు కి ఫైనల్ దత్తత ధృవీకరణ ఆర్డర్ కాపీ లను అందించారు. అదేవిధంగా వీరి ఫాలో అప్ వివరాలను నిర్దిష్ట ఫార్మాట్ లో ఎప్పటికప్పుడు సంబంధిత ఏజెన్సీ ల నుండి కలెక్ట్ చేసి మిషన్ వాత్సల్య పోర్టల్ లో అప్లోడ్ చేయవలసిందిగా జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్య చక్రవేణి నీ కలెక్టర్ వెట్రీ సెల్వీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లోని మిషన్ వాత్సల్య పథకం అమలు చేసే జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్యచక్ర వేణి, శిశు గృహ మేనేజర్ శ్రీమతి పి.భార్గవి పాల్గొన్నారు.