చట్టాలు,పేదరిక నిర్మూలన కోసం అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలుపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసు క్యాంపు ఆన్ నల్సా స్కీములుపై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు.
ఏలూరు,ఆగస్టు 30: సత్వర న్యాయం కోసం చట్టాలపై అవగాహనతో పాటు పేదరిక నిర్మూలన కోసం ఆమలు అవుతున్న సంక్షేమ పథకాలుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసు క్యాంపు ఆన్ నల్సా స్కీములుపై నిర్వహించిన ఒక్కరోజు అవగాహన సదస్సును జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనె సీతారామ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ 3,103 సంఘాలకు రూ 225.17 కోట్లు, స్త్రీనిధి ద్వారా 1935 సంఘాలకు రూ 66.32 కోట్లు, ఉన్నతి స్కీము ఎస్టీ, ఎస్సీ 231 గ్రూపులకు రూ 2.28 కోట్లు,దివ్యాంగ విద్యార్థులకు 3 టచ్ ఫోన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భీమడోలు,తాడేపల్లిగూడెం, చింతలపూడి,భీమవరం, నరసాపురం,తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, నిడదవోలు మండల సేవాసంస్థల సేవా కమిటీలు పనిచేస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన లోక్ అదాలత్ లో సివిల్ 373 కేసులు, యంబిఓపి 292 కేసులు, క్రిమినల్ 10,896 మొత్తం 11,561 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు.ఈ కేసులు అవార్డులు నిమిత్తం రూ 28.54 కోట్లు ప్రకటించడం జరిగిందన్నారు. అదే విధంగా పియల్ సి కేసులు పరిష్కరించి అవార్డు సొమ్ము క్రింద రూ 81.16 లక్షలు చెల్లింపులు జరిగాయని తెలిపారు. పేదలకు సత్వర న్యాయం అందించడంలో భాగంగా కేసులకు న్యాయం సహాయం అందించడం జరిగిందిన్నారు. జిల్లా వ్యాప్తంగా న్యాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, కొన్ని గ్రామాలలో 496 న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించామని తెలిపారు. జిల్లాలో మీడియేషన్ సెంటర్ల ను ఏర్పాటుచేసి 49 మంది మీడియేటర్లను నియమించామని, తద్వారా 1086 కేసులు పరిష్కారం చేసామని అన్నారు. అదేవిధంగా నల్సా క్రింద పేద నిర్మూలనకు అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలుపై పూర్తి అవగాహన కల్పించుటకు ఈ రోజు స్టాల్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలు ద్వారా పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు సవినయంగా వివరించారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిల్డ్రన్స్ హోమ్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. గృహ హింస గురించి పిజిఆర్ యస్ లో అందుతున్న ఫిర్యాదులపై కౌన్సిలింగులు నిర్వహించి ఇప్పటికే 132 కేసులు విజయవంతంగా పరిష్కరించామని తెలిపారు. వన్ స్టాపు సెంటర్లు ద్వారా మహిళలకు రక్షణతో పాటు సత్వర న్యాయం అందించడం జరుగుతుందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని,ఈ వ్యవస్థ నియంత్రించేందుకు 1098 టోల్ ఫ్రీ నెంబరరు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నషా ముక్త భారత్ అభియాన్ టోల్ ఫ్రీ నెంబరు 14446 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972 కు ఫిర్యాదులు అందించ వచ్చునని అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు పడిన వారికి కౌన్సిలింగును, వైద్యం అందించేందుకు అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంలో భాగంగా అసెస్మెంటు క్యాంపులు నిర్వహించి వీల్ చైర్లు,తదితర ఉపకారణాలను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా సీడ్ క్యాపిటల్ క్రింద వివిధ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి బ్యాంకర్లతో రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు ద్వారా యువతకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఇవే కాకుండా ఎస్సీ,ఎస్టీ కార్పొరేషనులు ద్వారా వివిధ సంక్షేమ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ సాగులో డ్రోన్లు వినియోగంపై కూడా శిక్షణ అందించి ఉపాధి కల్పించే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో డ్రగ్స్ నియంత్రణపై జిల్లా ఎస్పీతో కలిసి ముమ్మరంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.డ్రగ్స్ రహిత జిల్లాగా ఉంచేందుకు చేస్తున్న కార్యక్రమాల్లో రాష్ట్రంలో మన ఏలూరు జిల్లా ఒకటిగా ఉందన్నారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వారిలో విశ్వాసం పెంపొందించవచ్చని అన్నారు.ఆ దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం న్యాయ వ్యవస్థతో కలిసి పనిచేస్తుందని తెలిపారు.లోక్ అదాలత్ లో వివిధ కేసులు పరిష్కారంలో మన జిల్లా టాప్ 5 లో ఉందన్నారు.నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్ స్టాన్సెస్ యాక్టు కింద 7 కేసులు నమోదు చేసి 419 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.ఫోక్సో కేసులకు సంబంధించి న్యాయ స్థానాలు ద్వారా సత్వర న్యాయం అందటంలో బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారని అన్నారు. నాన్ బెయిల్ వారెంటుకు సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న పలు కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. హిట్ అండ్ రన్ యాక్సిడెంటు కేసులు సంబంధించి ఇటీవల కాలంలో జిల్లా కలెక్టరు వారి సహకారంతో 15 మందికి న్యాయ సహాయంతో పాటు ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. సమాజానికి చేటు చేస్తున్న డ్రగ్స్ నియంత్రణ పట్టిష్ట చర్యలు చేపట్టామన్నారు.మత్తు పదార్థాలు మూలంగా ఒక వ్యక్తికే కాకుండా మొత్తం జాతి భవిష్యత్తుకే నష్టం కలుగు తుందన్నారు.ఇటువంటి చర్యలకు పాల్పడే వారి సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు, పాఠశాలలు కళాశాలలో 877 ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేశామన్నారు.
స్టాల్స్ సందర్శన.
వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ రకాల స్టాల్స్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ సంయుక్తంగా ప్రారంభించి, పరిశీలించారు.ముందుగా ఐసిడియస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం డియల్ యస్ఏ న్యాయ సదస్సు, డిఆర్డిఏ, డిపిఓ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, విభిన్న ప్రతిభావంతులు, సోషల్ వెల్ఫేరు మరియు బిసి వెల్ఫేరు స్టాల్స్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు,బార్ అసోసియేన్ అధ్యక్షులు కోనె సీతారామ్,జిల్లా డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు, ప్రముఖ సీనియర్ న్యాయవాది కానాల రామకృష్ణారావు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, న్యాయవాదులు, స్థానిక ప్రజలు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, జిల్లా కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.