Close

చిరుధాన్యాలుతో రుచికరమైన వంటలు పుస్తకాలను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు .

Publish Date : 16/02/2026

ఏలూరు, ఫిబ్రవరి 16: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన చిరుధాన్యాలుతో రుచికరమైన వంటలు పుస్తకాలను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన చిరుధాన్యాలతో రుచికరమైన వంటలు పుస్తకాలను ప్రజలలోకి తీసుకుని వెళ్ళి, ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా రైతుకుటుంబాల్లోకి తీసుకువెళ్ళి చిరుధాన్యాలు వినియోగం మరియు సాగుపట్ల ఆసక్తి కలిగించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలని, సమతుల్య పోషకాహారంలో వాటి ప్రాధాన్యత విశేషమని జిల్లా కలెక్టరు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో జీవనశైలి మార్పులు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో చిరుధాన్యాలు వినియోగం ద్వారా ప్రజలు ఆరోగ్య వంతమైన జీవన విధానాన్ని అలవరుచుకోవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయంగా ఉపయోగించే జొన్నలు, సజ్జలు, రాగులు, తదితర వంటి చిరుధాన్యాలను మళ్ళీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ పుస్తకంలో చిరుధాన్యాలతో తయారు చేసే వివిధ రకాలు రుచికరమైన వంటకాలు వివరాలు, తయారీ విధానాలు, పోషక విలువలు సులభంగా అర్థమయ్యేలా అందించబడినట్లు తెలిపారు. గృహిణులు, యువత, స్వయం సహాయక సంఘాలు సభ్యులు ఈ పుస్తకాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసుకుని, కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, ఏపి యంఐపి పిడి డా. యస్. రామ్మోహన్, టెక్నికల్ ఏవో కె.కాళిమాత, తదితరులు పాల్గొన్నారు.