Close

జలధార-జలహారతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను రాష్ట్రంలోని నీటివనరులలో నీటి నిల్వ సామర్ధ్యం, భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.

Publish Date : 04/07/2026

ఏలూరు, జూలై , 4 : జలధార-జలహారతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను రాష్ట్రంలోని నీటివనరులలో నీటి నిల్వ సామర్ధ్యం, భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. జలధార-జలహారతి కార్యక్రమం చేపట్టిన పనుల ప్రగతిపై రాష్ట్ర సెక్రటరియేట్ నుండి శనివారం సాయంత్రం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పెషల్ సీఎస్ శశిభూషణ్ కుమార్ , జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ జలధార-జలహారతి కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార-జలహారతి కార్యక్రమం ద్వారా జల సంరక్షణ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. కురిసిన ప్రతీ వర్షం చుక్కని పరిరక్షించేలా పనులు నాణ్యతతో పూర్తిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొని జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమం ప్రగతిని తెలియజేసారు.

డ్వామా పీడీ సుబ్బారావు, ఇరిగేషన్ శాఖాధికారులు పాల్గొన్నారు.