జిల్లలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉంగుటూరు నియోజికవర్గం లోని ఉంగుటూరు మండలం లోని గోపినధపట్నం సచివాలయం నందు NTR భరోసా పింఛను పంపిణిలో భాగంగా హెల్త్ పెన్షన్ (CKDu) ను పెన్షన్ దారుని ఇంటివద్దనే పంపిణి చేయటం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసాపించను పధకము ఫించన్లు పంపిణీ ప్రభుత్వ ఆదేశంల ప్రకారం ది. 01.12.2025 వ తేదీన ఉదయం 7 గంటల నుండి పంపిణీ చేయడం జరిగింది.
జిల్లలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉంగుటూరు నియోజికవర్గం లోని ఉంగుటూరు మండలం లోని గోపినధపట్నం సచివాలయం నందు NTR భరోసా పింఛను పంపిణిలో భాగంగా హెల్త్ పెన్షన్ (CKDu) ను పెన్షన్ దారుని ఇంటివద్దనే పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమము లో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వీ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ నెలలో 2,59,688 మంది ఫించన్ దారులకు ఫించన్ పంపిణీ చేయవలసి ఉండగా 01.12.2025 ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయానికి 2,43,146 ఫించన్లు పంపిణీ చేయడం ద్వారా 93.63 శాతం ఫించన్లు పంపిణీ పూర్తి చేయడం జరిగింది. 605 సచివాలయాల పరిధి లోని 5039 మంది సిబ్బంది ప్రతి ఇంటి కి వెళ్ళి అవ్వా, తాత లకు ఫించన్ చెల్లించి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చారు. ఈ రోజు పంపిణీ చేయగా మిగిలిన లబ్ది దారులకు మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాలలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న లబ్దిదారులకు మానవతా దృక్పదము తో ఫించన్ లు అందించుటకు చర్యలు తీసుకొనవలెనని అలాగే ఫించన్ పొందని అందరి లబ్దిదారులకు సిబ్బంది స్వయంగా ఫోన్ చేసి 02.12.2025 సాయంత్రం లోగా 100 శాతం పంపిణీ పూర్తి చేయవలసినది గా గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఆదేశించారు.