జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో “జన భాగిదారి అభియాన్” కార్యక్రమాన్ని మరో వారం రోజులపాటు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఐటిడిఏ అధికారులను ఆదేశించారు. “జన భాగిదారి అభియాన్” కార్యక్రమం నిర్వహణపై సోమవారం సాయంత్రం ఏలూరు నుండి ఐటిడిఏ అధికారులత
ఏలూరు, మే, 25 : జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో “జన భాగిదారి అభియాన్” కార్యక్రమాన్ని మరో వారం రోజులపాటు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఐటిడిఏ అధికారులను ఆదేశించారు. “జన భాగిదారి అభియాన్” కార్యక్రమం నిర్వహణపై సోమవారం సాయంత్రం ఏలూరు నుండి ఐటిడిఏ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అనేక పధకాలను అమలు చేస్తున్నదన్నారు. వీటిని అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకునేందుకు “జన భాగిదారి అభియాన్” కార్యక్రమం ద్వారా ప్రతీ గిరిజన గ్రామంలోను గ్రామసభలు ఏర్పాటుచేసి, పధకాల వివరాలమీ వివరించాల్సి ఉంటుందన్నారు. గిరిజన గ్రామాలలో ప్రజలకు రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, పెన్షన్లు, తదితర ఎన్నో సమస్యలు ఉంటాయన్నారు. ఈ అభియాన్లో భాగంగా గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, కేవలం ప్రజల నుండి పదుల సంఖ్యలోనే దరఖాస్తులు అందడంతో, కార్యక్రమాల నిర్వహణ సక్రమంగా జరగలేదని, ప్రజల నుండి వివిధ సామజిక సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై దరఖాస్తులు చాలా తక్కువగా అందడంపై కలెక్టర్ స్పందిస్తూ “జన భాగిదారి అభియాన్” కార్యక్రమాన్ని మరో వారంరోజుల పాటు అన్ని గ్రామాలలోనూ నిర్వహించి ప్రజలకు విస్తృతమైన అవగాహన కలిగించాలన్నారు. నిర్వహించిన గ్రామ సభలకు సంబంధించి ఫోటోలను తప్పనిసరిగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. గిరిజన ప్రాంతాలలోని బడిబయట పిల్లలందరూ బడిలోనే ఉండాలని, నూరు శాతం ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకం, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఉండేలా చూడాలన్నారు. “జన భాగిదారి అభియాన్” కార్యక్రమంలో గిరిజనులకు ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కల్పించడం, శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, గ్రామ స్థాయిలో సేవల అందుబాటును మెరుగుపరచడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా చేయాలన్నారు.
ఐటిడిఏ పిఓ రాములు నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.