Close

జిల్లాలోని 669 గ్రామాల్లో జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహణ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 08/01/2025

ఏలూరు,డిసెంబర్ 8:జిల్లాలో 669 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 6,453 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.

జిల్లాలో జనవరి 8 వరకు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు.669 గ్రామసభల్లో 6,453 అర్జీలను స్వీకరించడం జరిగిందని, వాటిలో ఇప్పటికే 3,312 అర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిన అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం 45 రోజులు గడువు విధించిందని, నిర్ణీత సమయంలోగా నూరు శాతం అర్జీలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. పరిష్కారం కాని ఆర్జీలు ఎందుకు పరిష్కారంకాలేదో సంబంధిత వ్యక్తులకు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరుగుతుందన్నారు.
రెవెన్యూ సదస్సులో ముఖ్యంగా ముటేషన్ – పాసు బుక్కులు జారీ, రీ సర్వేలో భూ వ్యత్యాసాలు, 22a కేసులలో నిషేధిత భూములు తొలగింపు, తదితర భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలను అంద చేయడం జరిగిందని తెలిపారు. గ్రామ సభలను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్క అధికారికి, సభలను సజావుగా నిర్వహించడానికి సహకరించిన జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.