Close

జిల్లాలోని 7 నియోజకవర్గాలకుగాను 6 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, మరో ఒక నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ

Publish Date : 09/09/2026

ఏలూరు, సెప్టెంబర్, 9 : జిల్లాలోని 7 నియోజకవర్గాలకుగాను 6 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, మరో ఒక నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ చెప్పారు. నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు, వాటిల్లో మౌలిక సదుపాయాలు, పారిశ్రామికవేత్తలతో ఎంఓయూ ల పై రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో సిఎస్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ సాయిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ, తదితర సమస్యలు ఉన్న సమయంలో వాటిని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.ఎంఎస్ఎంఈ పార్కులలో రోడ్లు, వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులలో పరిశ్రమలు ఏర్పాటుచేసే పారిశ్రామికవేత్తలతో ఎంఓయు లు కుదుర్చుకోవాలన్నారు.

ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో చేపట్టిన చర్యలు గురించి వివరించారు. ఏలూరు జిలాల్లో ఏలూరు, చింతలపూడి, పోలవరం, కైకలూరు, నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు తుది దశలో ఉందన్నారు. దెందులూరు, నూజివీడుల లో పురోగతిలో ఉన్నాయని, ఉంగుటూరు నియోజకవర్గాలలో భూసేకరణ దశలో ఉన్నాయన్నారు.
ఏలూరు జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులలో పరిశ్రమలు ఏర్పాటుచేసే పారిశ్రామికవేత్తలతో ఎంఓయూలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏలూరు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చిన పారిశ్రామికవేత్తలతో చర్చించి త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేసారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ ముక్కంటి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, జిల్లా పారిశ్రామిక మౌలిక సదుపాయాలకల్పన జోనల్ మేనేజర్ బాబ్జి, ప్రభృతులు పాల్గొన్నారు.