జిల్లాలో డీజిల్ సమస్యపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తన ఛాంబర్ లో అత్యవసరం సమావేశం నిర్వహించారు.
Publish Date : 27/04/2026
ఏలూరు, ఏప్రిల్, 27 : జిల్లాలో డీజిల్ సమస్యపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తన ఛాంబర్ లో అత్యవసరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఏ బంకు లోనూ పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఏ బంకు లోనైనా డీజిల్ నిల్వలు అయిపోతే వెంటనే గుర్తించి ఆయా బంకులకు యుద్ధప్రాతిపదికన ట్యాంకర్లు పంపించాలన్నారు. ఏ బంకు లోనూ పెట్రోల్, డీజిల్ నిల్వలు లేవని బోర్డులు కనపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పడు బంకు యజమానులతో చర్చిస్తూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు.