జిల్లాలో త్రాగునీరు, సాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు.
ఏలూరు, ఫిబ్రవరి, 24 : జిల్లాలో త్రాగునీరు, సాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జిల్లాలో త్రాగునీరు, సాగునీటి సరఫరాపై ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో రానున్న వేసవిలో త్రాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా చూడాలన్నారు. కృష్ణా కెనాల్, పంటల కాల్వలలో తూడు తొలగించి సాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని, శివారు ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలోని మంచినీటి నీరు చెరువులను కాల్వలను మూసివేసేలోగా పూర్తిస్థాయిలో నింపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి . నాగార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనీర్ భానుప్రతాప్, ఇంజనీర్లు పి . సుబ్రహ్మణేశ్వరరావు, ఎస్. సుబ్రహ్మణ్యేశ్వరరావు, .