Close

జిల్లాలో పదవతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రి సెల్వి ..

Publish Date : 23/02/2026

ఏలూరు, ఫిబ్రవరి 23: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం పదవతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎస్.ఎస్.సి. పరీక్షలు నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచెయ్యాలని దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాలు వద్ద తాగునీరు, విద్యుత్తు, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. ప్రశ్నాపత్రాలు రవాణా, భద్రపరిచే విధానం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఏటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ సహకారం తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వైద్యశాఖ ద్వారా అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు మార్చి–2026 16-03-2026 నుండి 01-04-2026 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించ బడనున్నాయని అన్నారు. పరీక్షలు ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని, ఈ పరీక్షలకు మొత్తం 24,019 మంది అభ్యర్థులు నమోదు కాగా, అందులో రెగ్యులర్ విభాగంలో బాలురు 11,117 మంది, బాలికలు 11,873 మంది కలిపి 22,990 మంది హాజరు కానున్నారని, ఒకసారి ఫెయిల్ అయ్యి మరల పరీక్షకు హాజరయ్యే బాలురు 698 మంది, బాలికలు 331 మంది కలిపి 1029 మంది హాజరు కానున్నారు. మొత్తం గా బాలురు 11,815 మంది, బాలికలు 12204 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు 133 కేంద్రాల్లో నిర్వహించడం జరుగు తుందన్నారు. ఇందుకు సంబంధించి 133 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 133 మంది డిపార్ట్మెంట్లు అధికారులు, 3 అదనపు డిపార్ట్మెంట్లు అధికారులు,62 మంది కస్టోడియన్స్ అధికారులు, 6 మంది ఫ్లేయింగు స్క్వాడ్లు బృందాలు, 11 మంది రూటు అధికారులు, 11 మంది సహాయ రూటు అధికారులు నియమించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో ఏపీ ఓఎస్ఎస్ వోకేషనల్ పబ్లిక్ పరీక్షలు ఇంటర్మీడియట్ 2.3.2026 నుంచి 13.3.2026 వరకు ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు నిర్వహించడం జరుగు తుందన్నారు.4 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

ఏపీ ఓఎస్ఎస్ వోకేషనల్ పబ్లిక్ పరీక్షలు ఎస్ఎస్సి పరీక్షలు 16.3.2026 నుంచి 28.3.2026 వరకు ఉదయం 9.30 గంటలు నుండి మధ్యాహ్నం 12.30 గంటలు వరకు నిర్వహించడం జరుగు తుందన్నారు. 11 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 803 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి ఒకేషనల్ కోర్సులో పరీక్షలకు 1539 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమమ్మ, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.