జిల్లాలో పెట్రోల్ బంక్ లకు అవసరమైన డీజిల్ ట్యాంకర్లు ఇండెంట్ లను బంక్ యజమానులతో మాట్లాడి వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తహసీల్దార్లను ఆదేశించారు.
ఏలూరు, ఏప్రిల్, 27: జిల్లాలో పెట్రోల్ బంక్ లకు అవసరమైన డీజిల్ ట్యాంకర్లు ఇండెంట్ లను బంక్ యజమానులతో మాట్లాడి వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో డీజిల్ సమస్యపై సోమవారం రాత్రి తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖ సిబ్బందితో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ బంక్ లలో నిల్వలను తహసీల్దార్లు పరిశీలించి, డీజిల్ అవసరమైన బంక్ లను గుర్తించి, వారికి అవసరమైన డీజిల్ ట్యాంకర్ల ఇండెంట్ ని వెంటనే తీసుకుని నివేదిక సమర్పించాలన్నారు. ఇండెంట్లను సంబంధిత ఆయిల్ కంపెనీలకు పంపించి, రేపు ఉదయం నాటికి ట్యాంకర్ల ద్వారా డీజిల్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బంక్ లలో డీజిల్ పక్కదారి పట్టకుండా, అధిక ధరలకు విక్రయించకుండా తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు.