Close

జిల్లాలో ‘ప్రాజెక్ట్ మాతృ’ పధకం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం ‘ప్రాజెక్ట్ మాతృ’ పధకం అమలుపై అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షి

Publish Date : 03/07/2026

ఏలూరు, జూలై , 3 : జిల్లాలో ‘ప్రాజెక్ట్ మాతృ’ పధకం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం ‘ప్రాజెక్ట్ మాతృ’ పధకం అమలుపై అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గర్భిణీ, బాలింతల ఆరోగ్య పరిరక్షణ ‘ప్రాజెక్ట్ మాతృ’ పధకం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో ఎక్కడా ఏ గర్భిణీ, బాలింత కూడా పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటి వారికీ గురికాకుండా చూడాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం లేకుండా వారికీ అవసరమైన పౌష్టికాహారం, తృణధాన్యాలు , పళ్ళు, వారికి ఆరోగ్య పరిస్థితులకు అవసరమైన ఔషధాలను వారానికి ఒకసారి అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎం లు తమ పరిధిలోని గర్భిణీ ల ఆరోగ్య పరిరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, గర్భం దాల్చిన ప్రసవం వరకు దగ్గరనుండి ఆరోగ్యపరీక్షలు నిర్వహించి, ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టిన ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. జిల్లాలో మాతా, శిశు మరణాలు సంబంవించకుండా ఐసిడిఎస్., వైద్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలోని గర్భిణీ, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శోభ , ఐసిడిఎస్ పి . శారద, జిల్లాలోని వివిధ ప్రాంతీయ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.