Close

జిల్లాలో లక్ష్యంగా నిర్ణయించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 04/06/2026

ఏలూరు, జూన్, 4 : జిల్లాలో లక్ష్యంగా నిర్ణయించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం వ్యవసాయ, అనుబంధ రంగాలు, జలధార, సూర్యఘర్ యోజన, తదితర కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ ప్రధానమైన ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, నిర్దేశించిన లక్ష్యాల మేర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరితగతిన ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు రాబోయే ఖరీఫ్ లో రైతులకు విత్తనాల సరఫరా నుండి ధాన్యం కొనుగోలు వరకు వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. జిల్లాలో ఎరువులకు ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు సాగు విస్తీర్ణం మేరకు అవసరమైన ఎరువులు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జలధార కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ పనులను ఈనెల 15వ తేదీ లోగా పూర్తిచేయాలన్నారు. కాలువలకు నీటి విడుదల దృష్ట్యా ఇరిగేషన్ శాఖ ద్వారా ఓ అండ్ ఎం పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. సూర్య ఘార్ యోజన పధకం ద్వారా జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. సూర్యఘర్ ప్రయోజనాలపై ప్రజలకు గ్రామ స్థాయిలో పూర్తిగా అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, ఇరిగేషన్, ఆర్ అండ్ బి., ట్రాన్స్కో ఎస్ఈ లు దేవప్రకాష్, కె. విజయరత్నం,, బి.ఎం. అంబేద్కర్, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, ఆర్.టి.ఓ శేఖర్, డ్వామా పీడీ కె.వి. సుబ్బారావు, డిఎంహెచ్ఓ డా. యు.శోభ, ఆర్టీసీ ఆర్ఎం షబ్నమ్, జిల్లా పౌర సరఫరాల అధికారి శివరామ మూర్తి, ప్రభృతులు పాల్గొన్నారు.