• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

జిల్లాలో 2,58,098 మంది ఫించన్ దారులకు రూ. 112.73 కోట్లు.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 30/06/2025

ఏలూరు,జూన్,30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్.టి.ఆర్. భరోసాపించన్ల పంపిణీ లబ్దిదారుల ఇంటివద్దనే నూరుశాతం జరగాలని, పంపిణీలో ఏవిధమైన సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో జులై నెల ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల చెల్లింపులు జూలై 1వ తేదీ మంగళవారం ఉదయం 7.00 గంటల నుంచి ప్రారంభించాలన్నారు. జిల్లా లో జులై నెలలో 2,58,098 మందికి పెన్షన్ల పంపిణీకి రూ. 112.73 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మొదటి రోజునే నూరుశాతం పెన్షన్ల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనివార్య కారణాలచేత జూలై1 వ తేదీన తీసుకోని వారికి జూలై 2 వ తేదీ న పంపిణీ చేయాలన్నారు. జిల్లా లో 5275 మంధి సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది తో ఫించనల పంపిణీకి ఏర్పాటు చేయడమైనదన్నారు. సంబంధిత సిబ్బంది ద్వారా జూలై 1వ తేదీ 7 గంటల నుండి ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఏ పిడిని కలెక్టర్ ఆదేశించారు. పింఛను పొందేందుకు పింఛను దారులు వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం అంధించడం జరిగిందన్నారు.