జిల్లాలో 7 నియోజకవర్గాలకుగాను 4 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, మరో 3 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి
ఏలూరు, జూలై , 7 : జిల్లాలో 7 నియోజకవర్గాలకుగాను 4 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, మరో 3 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి కి చెప్పారు. నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు, 22ఏ భూ సమస్యల పరిష్కారం,రీసర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవిన్యూ వన్, తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆగష్టు నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల కెవైసి పూర్తిచేసి, రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్, తదితర వివరాలను పరిశీలించి తప్పులు లేకుండా పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో చేపట్టిన చర్యలు గురించి సిసిఎల్ఏ జయలక్ష్మి కి వివరించారు. ఏలూరు జిలాల్లో చింతలపూడి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు తుది దశలో ఉందన్నారు. ఏలూరు పోలవరం, కైకలూరు లో పురోగతిలో ఉన్నాయని, దెందులూరు, నూజివీడు, ఉంగుటూరు నియోజకవర్గాలలో భూసేకరణ దశలో ఉన్నాయన్నారు. జిల్లాలో ఆగష్టు నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.