Close

జిల్లా ఇంచార్చ్ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లను మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమొక్కలను అందజేశారు …

Publish Date : 16/06/2026

ఏలూరు, జూన్ 16: స్థానిక ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇంచార్చ్, రాష్ట్ర పౌరసరఫరాలు మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు మంత్రి కొలుసు పార్థసారథి లను మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు పూలమొక్కలను అందజేసారు. జిల్లా కలెక్టరుతో ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్,జిల్లా ఎస్పి కె.ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య( చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ రీజియన్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస రెడ్డి, ఏపీ ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు లు పూలబోకేలు, పూలమొక్కలను అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి డిఆర్వో ఎల్.దేవకీదేవి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.