జిల్లా కమర్షియల్ టాక్స్ కో-ఆర్డినేషన్ (రెవిన్యూ వచ్చే శాఖలు) సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి దిశానిర్దేశం .
ఏలూరు, ఫిబ్రవరి 13: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కమర్షియల్ టాక్స్ కో-ఆర్డినేషన్ ( రెవిన్యూ వచ్చే శాఖలు) జిల్లా కలెక్టరు అధ్యక్షతన కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రెవిన్యూ వచ్చే శాఖలు వారీగా సమీక్షించి, నిర్ణీత గడువులోగా రావలసిన బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమ చేయించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కమర్షియల్ టాక్స్, జిల్లా సివిల్ సప్లై, మైన్స్, పోలీసు శాఖలతో జాయింటు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, రెవిన్యూ వసూళ్లులో ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ పురోగతిని సాధించాలన్నారు. ప్రతి నెల రెండవ వారంలో జిల్లా కలెక్టరేటులో ఒక సమావేశాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, రెవిన్యూ వసూళ్లు ప్రగతిని, వచ్చే నెలలో రెవిన్యూ వసూళ్లపై ఈ సందేశంలో శాఖలు వారీగా చర్చిస్తామని తెలిపారు. అలాగే మండల స్థాయిలో కూడా సమావేశం నిర్వహించాలని అన్నారు. జిల్లాలో జీఎస్టీ ఏరియర్సు 249 కేసులు ద్వారా రూ 24 కోట్లు రావాల్సిఉందని శాఖలు వారీగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రెవిన్యూ రికవరికీ కావలసిన సహకారం పూర్తిస్థాయిలో సమకూర్చుకుని, మంచి ప్రగతిని సాధించాలన్నారు. సరుకులు ఎగుమతులు అయ్యి రవాణా అవుతున్న వాహనాలకు వే బిల్లులు, బిల్లులు, చెక్ చెయ్యాలని, సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేసి సమర్థవంతంగా తనిఖీలు చెయ్యాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు, ఆర్&ఆర్ ప్యాకేజీ భారీ, చిన్నతరహా పనులకు కాంట్రాక్టరుకు చెల్లించిన సొమ్ములు జమ అయినది వెరిఫై చేసి, వీటిద్వారా రావలసిన టాక్స్ జమ అయిందా పరిశీలన చెయ్యాలని అన్నారు. ఏపీ డబ్ల్యూ ఐడిసి, ఆర్ &బి, పంచాయతీరాజ్,గృహనిర్మాణ శాఖలుతో ఒక కమిటీ ఏర్పడి ఎప్పటికప్పుడు వెరిఫై చేసి పూర్తిస్థాయిలో నివేదికలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. కమర్షియల్ టాక్స్ విభాగానికి, రెవిన్యూ వచ్చే శాఖలకు సంబంధించిన పన్ను వసూళ్ల పురోగతి, బకాయిలు వసూళ్లు, జీఎస్టీ అమలు, ఈ-వే బిల్ తనిఖీలు, అక్రమ రవాణా నియంత్రణ చర్యలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. ఆదాయ వనరులను పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని, లక్ష్యాలను అధిగమించాలని సూచించామని తెలిపారు. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించడంతో పాటు, వ్యాపార వర్గాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించామని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెంపు లక్ష్యంగా అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని పేర్కొన్నారు. వివిధ శాఖలు పరిధిలో పెండింగులో ఉన్న పన్నులు, ఫీజులు, లీజులు మరియు ఇతర బకాయిలు వివరాలను సమగ్రంగా పరిశీలించి, వసూళ్ల ప్రక్రియను వేగవంతం చెయ్యాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఆదాయం పెంచేందుకు అనుసరించ వలసిన మార్గాలుపై సమీక్షించడం జరిగిందని అన్నారు. ఖనిజాలు, ఇసుక, భూములు లీజులు, వాణిజ్య పన్నులు, స్టాంపు డ్యూటీలు వంటి వనరులు ద్వారా ఆదాయం పెంపు సాధ్యమని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు వినియోగాన్ని మెరుగు పరచడం, లీజులు పారదర్శకంగా నిర్వహించడం, డిజిటల్ పద్ధతుల్లో వసూళ్లు చేయడం ద్వారా ఆదాయం పెంపు సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి శాఖ అధికారి తమ శాఖకు సంబంధించిన వసూళ్ల లక్ష్యాలను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చెయ్యాలని స్పష్టంచేసినట్లు తెలిపారు. నెలవారీ సమీక్ష సమావేశాలు నిర్వహించి పురోగతిని పరిశీలిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ నక్కా సూర్య చంద్రరావు, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, కమర్షియల్ టాక్స్ జాయింటు కమీషనరు బి.నాగార్జున రావు, ఆర్&బి శాఖ యస్ఇ కె.విజయరత్నం, జడ్పీ సిఇవో యం.శ్రీహరి, జిల్లా ఆర్ డబ్ల్యూ యస్ అధికారి జి.త్రినాథ బాబు, సివిల్ సప్లై జిల్లా మేనేజరు పి.శివరామ మూర్తి, జిల్లా డియస్ వో ఇ.బి. విలియమ్స్, మైన్స్ డిడి జి.పాపారావు, జిల్లా పరిశ్రమలు కేంద్రం జియం ఆర్.వెంకటరావు, లీగల్ మెట్రాలజీ సహాయ కంట్రోలరు కె.యస్.రాజు, కమర్షియల్ టాక్స్ అధికారులు, సంబంధిత శాఖలు అధికారులు పాల్గొన్నారు.