జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్..
Publish Date : 26/04/2025
ఏలూరు,ఏప్రిల్,26: ఏలూరు జిల్లా నూతన ప్రధాన సివిల్ న్యాయమూర్తి (Principal District Judge) సిరిపురం శ్రీదేవిని శనివారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా జడ్జి సిరిపురం శ్రీదేవి కు పూలమొక్క అందజేశారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు.