Close

జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 31/12/2024

ఏలూరు,డిశంబరు, 31: స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రకారం జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు సంకల్పానికి అనుగుణంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు.

స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏదైనా లక్ష్యం సాధించాలంటే రోజూవారీ కార్యాచరణ తో కష్టపడవలసివుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన జిల్లాకలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి పేర్కొన్నఅంశాలన్నీ ఇకపై జరిగే సమావేశాల్లో అజెండాగా ఉండాలన్నారు. ఆమేరకు ఎప్పటికప్పుడు లక్ష్యసాధనలో పురోగతి కనబరచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రతి పక్షానికి ఒకసారి జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. పరిశ్రమల్లో ప్రమాధాల నివారణకు నిర్వహించిన తనిఖీల అనంతరం ఆయా పరిశ్రమల్లో తీసుకోవల్సిన భధ్రత చర్యలపై ఆయా యాజమాన్యాలు తీసుకున్న చర్యల నివేదికలను పొందాలని, నివేదికలు అందించని యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్ధాపనను ప్రోత్సహించాలని అందుకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన ధరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. పరిశ్రమల అనుమతికోసం 236 దరఖాస్తుల్లో 239 ఆమోదం పొందాయన్నారు. నిర్ధిష్ట గడువువరకు వేచిచూడకుండా సత్వరమే నబంధనలమేరకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ అదేశాల మేరకు జరుగుతున్న ఎంఎస్ఎంఇ సర్వేను వేగవంతం చేసి పూర్తిచేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి రాయితీలుకు అందిన క్లైయిమ్ లను స్క్రూటినీ , వెరిఫికేషన్ కమిటీ క్షుణంగా పరిశీలించి ప్రతిపాధనలు సమర్పించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ఇండస్ట్రీయల్ క్లస్టర్ల అభివృద్ధికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఉపాధిహామీ కార్యక్రమం (పిఎంఇజిపి) కింద పరిశ్రమల ఏర్పాటుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పిఎంఇజిపి కింద పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తిచూపే ప్రతినిధులతో డిఆర్డిఏ, వ్యవసాయ, ఉధ్యాన, ఎల్ డిఎం తదితర అధాకారులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ధరఖాస్తు చేసుకున్న పారిశ్రామిక వేత్తలకు రుణాల మంజూరులో ఏమైనా సమస్యలుంటే బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలన్నారు. ఓఎన్ డిసి ప్లాట్ ఫాంలో జిల్లాలోని మండలాల వారీగా ఒక ఉత్పత్తిని విక్రయాలకు ఉంచే విధంగా వ్యవసాయ, ఉధ్యాన, డిఆర్డిఏ, ఐటిడిఏ తదితర శాఖలు అర్హులైన వారిని గుర్తించాలన్నారు. ఓఎన్ డిసి కి సంబంధించి ఆయా శాఖల అధికారులతో కలిపి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎంను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న 110 పరిశ్రమల్లో చైల్డ్ కేర్, ఫీడింగ్ రూం లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ద్వారకాతిరుమల మండలం పి. కన్నాపురంలో శ్రీసర్వారాయ సుదర్శ్ లిమిటెడ్ కు సంబంధించి నీటి సరఫరాపై తీసుకోవల్సిన చర్యలపై సాంకేతిక పరమైన అంశాలతో కూడిన టెక్నికల్ రిపోర్టును సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం సుబ్రహమణ్యేశ్వరరావు,
డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఎల్ డిఎం డి. నీలాధ్రి, వ్యవసాయశాఖ జెడి హాబీబ్ భాషా, ఉధ్యానశాఖ డిడి రామ్మెహన్, ఎపిఐఐసి జెడ్ఎం కె. బాబ్జి, వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమీషనరు రాంబాబు, లీగల్ అండ్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ హరిప్రసాద్, సోషల్ వెల్పేర్ జెడి జయప్రకాష్, డిప్యూటీ ఇన్స్పేక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్. త్రినాధరావు, కాలుష్యనియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వరరావు, గ్రౌండ్ వాటర్ డిడి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.