జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష …
ఏలూరు, మే 26: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో సంబంధిత శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, సంబంధిత శాఖల అధికారులతో కలసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జిల్లాలో పరిశ్రమలు ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిషత్తు కార్యాచరణను మండలాలు, శాఖలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించుటకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యాలను పూర్తిచెయ్యాలని ఆదేశించారు. గిరిజన తండాల్లో యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాలకు వెలుగులు నింపాలన్నారు. ఐటిడిఏ గిరిజన ఉత్పత్తులు నాణ్యతను మరింత పెంచి, అందమైన ప్యాకింగులు, రవాణా, మార్కెటు సౌకర్యం కల్పించి గిరిజనకుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని అన్నారు. భాగస్వామ్య సదస్సులో ( MOUs ) ఏలూరు జిల్లాలో పది పరిశ్రమలు ప్రగతిని మండలాలు వారీగా సమీక్షించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు టార్గెట్ 168 కాగా 102 గ్రౌండింగు అగుటపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ మిగతా 66 బ్యాంకు రుణాలను ఇప్పించి, ఈనెల చివరినాటికి ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు నూటికినూరు శాతం లక్ష్యాలను పూర్తి చెయ్యాలని ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 130 ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు టార్గెట్ కాగా, ఇదేస్ఫూర్తితో లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీనియోజక వర్గానికి ఇండస్ట్రియల్ (MSME) పార్కులు చింతలపూడి నియోజకవర్గం ప్రారంభోత్సవానికి సిద్ధం చెయ్యాలని, ఏలూరు నియోజకవర్గం రెండు నెలలోనూ, కైకలూరు, పోలవరం నియోజక వర్గంలో మూడునెలల్లో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. మిగిలిన నూజివీడు, దెందులూరు, ఉంగుటూరు నియోజక వర్గాల్లో ఈ నెల చివరినాటికి శంకుస్థాపనలకు సిద్ధం చెయ్యాలని అన్నారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమలు స్థాపనకు అవగాహన కల్పించి, సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు జారీ చెయ్యాలన్నారు. పరిశ్రమలు రాయితీపై సమీక్షించి సన్న, చిన్న, యంయస్ యంఇ పరిశ్రమలు పెట్టుబడి రాయితీ 13 యూనిట్లకు రూ 19.12 కోట్లు, స్టాంపు డ్యూటీ సబ్సిడీ రెండు యూనిట్లకు రూ 7.50 లక్షలు, మంజూరు చేసామని తెలిపారు. రాంప్ ప్రోగ్రాం నందు ఇచ్చిన టార్గెట్స్ జూన్ నెలాఖరు లోగా పూర్తిచెయ్యాలని, అలాగే సెర్ప్, మెప్మా డిపార్ట్మెంట్స్ తో కలిసి ఇంటల్లుక్టుల్ ప్రాపర్టీ రైట్స్ ప్రోగ్రాంని నిర్వహించామని అన్నారు. జెడ్ ఏజెన్సీని త్వరగా టార్గెట్ కంప్లీట్ చేసేలా చూడాలని అని రాంప్ నోడల్ ఆఫీసరు యన్.జితేంద్ర బాబుని జిల్లా కలెక్టరు ఆదేశించారు. రూ 20 లక్షలు వ్యయంతో పచ్చి కొబ్బరి బొండాలతో పీచుపరిశ్రమ యూనిట్ స్థాపనకు ఏలూరు రూరల్ మండలంలో గాని పెదపాడు మండలంలో గాని 50 సెంట్లు భూసేకరణ చెయ్యాలని అన్నారు. యూనిట్ స్థాపనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను గుర్తించాలని డిఆర్డిఏ పిడిని జిల్లా కలెక్టరు ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకటరావు, ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, జిల్లా పరిశ్రమలు తనిఖీ అధికారి కె.కృష్ణమూర్తి, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్.జితేంద్రబాబు, విద్యుత్తు శాఖ యస్ఇ పి.సల్మాన్ రాజు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, యల్డియం డి.నీలాద్రి, మత్స్యశాఖ డిడి బి.రాజ్ కుమార్, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.