Close

జిల్లా యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యలతో ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత సమస్యకు తెరపడింది.

Publish Date : 28/04/2026

ఏలూరు, ఏప్రిల్, 28 : జిల్లా యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యలతో ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత సమస్యకు తెరపడింది. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, రెవిన్యూ అధికారులు గత రెండురోజులుగా డీజిల్ కొరత సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గత శనివారం నుడ్ని సోషల్ మీడియాలలో డీజిల్ కొరత అని కొన్ని వదంతులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనలతో అధిక మొత్తంలో డీజిల్ కొనుగోలు చేయడంతో డీజిల్ కొరత పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రముఖ్యమంత్రివర్యులు, జిల్లా మంత్రులు ఆదేశాలతో జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి , జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ లు నిరంతరం ఎప్పకప్పుడు పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తూ, సోషల్ మీడియా వదంతులపై ప్రజలకు వివరించారు. జిల్లాలో సరిపడా డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రజలకు తెలియజేసారు. డీజిల్ నిల్వలు లేని బంక్ లకు ట్యాంకర్లను తరలించడంతోపాటు, నిల్వలు పూర్తిఅయ్యే బంకులను ముందుగానే గుర్తించి వాటికి కూడా ట్యాంకర్లను రప్పించడానికి యుద్దప్రాతిపదికన చేసిన కృషి ఫలితంగా మంగళవారం ఉదయం నుండి జిల్లాలోని పెట్రోల్ బుంకెలా వద్ద వినియోగదారులు రద్దీ తగ్గుముఖం పట్టింది. . జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంక్ లలో డీజిల్ నిల్వలు సాధారణ అవసరాలకు సరిపడా ఉన్న కారణంగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బంక్ ల వద్ద రద్దీ తగ్గింది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన వదంతులేనని, డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలలో నమ్మకం కలిగింది. జిల్లాలో ఇప్పుడు ఏ బంక్ లో చూసినా డీజిల్ కోసం క్యూ లైన్లు లేవు. అంతా సాధారణ స్థితికి చేరుకుంది. గత రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవిన్యూ, పౌర సరఫరాల శాఖ సిబ్బంది చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చింది.