Close

జిల్లా రిసోర్స్ పర్సన్లు (డిఆర్ పిఎస్) ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానం.. డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు.

Publish Date : 02/01/2025

ఏలూరు, జనవరి, 2: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్, పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పిఎంఎఫ్ఎంఇ) పథకం కింద జిల్లా రిసోర్స్ పర్సన్లు (డిఆర్ పిఎస్) ఎంపిక కోసం దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నట్లు డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలపారు. ఈ పథకం క్రెడిట్ లింక్ట్ సబ్బిడీ ఐ ప్రోగ్రామ్ గా చిన్నతరహా ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ఫైజెస్ను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఎంపికైనా అభ్యర్థులు పిఎంఎఫ్ఎంఇ పథకం యొక్క నోడల్ ఏజెన్స అయిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ పై ప్రాసెసింగ్ సొసైటీ(ఎపిఎఫ్ పిఎస్) ద్వారా డిఆర్ పిఎస్ గా నియమించబడతారన్నారు. డిఆర్ పిఎస్ ఇన్సెంటివ్ ఆధారంగా మాత్రమే నియమించబడతారని, స్థిరమైన నెలవారీ వేతనం ఉండదన్నారు.
ప్రతి మండలానికి ఒక డిఆర్ పి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారన్నారు. నియమించబడిన డిఆర్ పిఎస్ తగిన పారిశ్రామికవేత్తలను గుర్తించడం, పిఎంఎఫ్ఎంఇ పథకం వివరించడం, హెచ్ బిఎస్ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ ఆలోచనలను సూచించడం, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు(డిపిఆర్ఎస్) తయారు చేయడం, బ్యాంకులతో సమన్వయం చేసి రుణాలను పొందడం మరియు యూనిట్ స్థాపన, ఎఫ్ ఎస్ఎస్ఎఐ లైసెన్స మరియు ఉద్యోగులు నమోదు పూర్తి చేయడంలో సహకరించడం వంటి పనులను నిర్వహిస్తారన్నారు. ఫెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇన్సెంటివ్స్ అందిస్తారు – బ్యాంకు రుణం పొందిన తర్వాత Rs.10,000/- మరియు డిపిఆర్ ప్రకారం యూనిట్ స్థాపన, అధికారికత పూర్తయిన తర్వాత మళీ Rs.10,000/- అందిస్తారన్నారు. 21 సం. నుండి 30 సంవత్సరాలు (01-11-2024 నాటికి )వయస్సు కల్గి, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ పరిజ్ఞానము, సొంత ఆండ్రాయడ్ ఫోన్ మరియు ట్రావెల్ చేయుటకు ఇష్టమైన స్త్రీ, పురుషులు మరియు ట్రాన్స్ జెండర్స్ అర్హులన్నారు. పుడ్ ప్రాసెసింగ్ మరియు నేచురల్ డెవలప్ మెంట్ నందు అనుభవం వున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. వారి మండలంలో ఎంటర్ఫైజ్ అభివృద్ధిక సహాయం చేయడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. https://forms.gle/34TwTSQV8iSUMV8P6 షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ వివరాలు ఈమెయిల్ మరియు ఎస్ ఎం ఎస్ ద్వారా తెలియజేయబడతాయన్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ:05-01-2025. మరిన్ని వివరముల కొరకు నెంబరు: 8885851686 సంప్రదించవచ్చన్నారు.