Close

జిల్లా విభిన్న ప్రతిభావంతుల పునరావాస కేంద్రం, ఏలూరు జిల్లా యొక్క డి .ఎం. టి సమావేశం బుధవారం కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలక్టర్ కె . వెట్ సెల్వి అధ్యక్షతన జరిగింది

Publish Date : 29/01/2025

ఏలూరు/జనవరి 29 :జిల్లా విభిన్న ప్రతిభావంతుల పునరావాస కేంద్రం, ఏలూరు జిల్లా యొక్క డి .ఎం. టి సమావేశం బుధవారం కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలక్టర్ కె . వెట్ సెల్వి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏలూరు జిల్లా లో దొండపాడు నిర్వహించబడుతున్న జిల్లా పునరావాస కేంద్రం ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ ద్వారా జిల్లాలోని అవసరత కలిగిన దివ్యాంగుల అందరూ ఉచితంగా ఫిజియోథెరపీ, క్యాలిపర్స్, మున్నగు కృత్రిమ అవయవాల తయారు చేయించుకుని లబ్ధి పొందే లాగా జిల్లా అంతట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని దానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే సంబంధిత అధికారులకు తెలియజేసి , ఎక్కువమంది ప్రజలు హాజరయ్యేలాగా ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వికలాంగుల పునరావస కేంద్రం ప్రగతి పథంలో నడుపుటకు తీసుకోవలసిన చర్యలపై చర్చించడం జరిగింది.
అలాగే జూలై 2024 నుండి జనవరి 25 వరకు నిర్వహించిన అవగాహన సదస్సులు నివేదికలను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఇంకను ఇతర వివరాలు కొరకు స్వయంగా కానీ ఫోన్ సంఖ్య 08812-249297, మరియు 7386565469 నకు సంప్రదించి సదరు సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రతిభావంతుల ,హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు బి .రామ్ కుమార్, డిపిఓ. కె .అనురాధ ఐసిడిఎస్ పిడి శారద, ఉమా ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ సొసైటీ ఇన్ ప్లాంటింగ్ ఏజెన్సీ పెద్దిరెడ్డి, సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ తదితరులు పాల్గొన్నారు.