డా.బి.ఆర్. అంబేద్కర్ కు నివాళులు అర్పించిన జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి..
ఏలూరు, ఏప్రిల్, 14: డా. బి.ఆర్. అంబేద్కర్ రచనలు ప్రతిఒక్కరూ చదవాలని జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పేర్కొన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా జ్యోతి ప్రజ్వలనచేసి డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఇన్ చార్జి కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఆర్.టి.సి. రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతోపాటు పలువురు దళితనాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్బంగా విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు జ్ఞాపికను, సర్టిఫికెట్లను అందజేసారు. ఈ సందర్బంగా ఇన్ చార్జి కలెక్టర్ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ రచనలు సామాజిక న్యాయం, సమానత్వం, మానవహక్కుల గురించి అవగాహన కల్పిస్తాయన్నారు. ముఖ్యంగా విద్యార్ధులు ప్రియాంబుల్ ఆఫ్ భారత రాజ్యాంగ్యం తప్పనిసరిగా చదవాలన్నారు. ఆయన రచనలు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలయొక్క అవసరాలు, ఆకాంక్షలను వివరిస్తాయన్నారు. విద్యను ఆయుధంగా చేసుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ సమాజంలో ఉన్నత స్ధానానికి ఎదిగారన్నారు. అదే విధంగా సమాజంలోని మహిళలకు సమానత్వం కల్పించేందుకు, అసమానతలు తొలగించేందుకు వారి కృషి ఎనలేనిదన్నారు.
ఆర్.టి.సి. రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ దేశంలో మత, కుల, లింగ వివక్షత లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేఛ్చనిస్తూ రాజ్యాంగబధ్దం చేయడంలో డా. అంబేద్కర్ కృషి మరువలేనిదన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు అంబేద్కర్ ఆశయసాధనకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ అని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న సోషల్ వెల్పేర్ జెడి వి. జయప్రకాష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, దళిత నాయకులు నేతల రమేష్ బాబు, పొలిమేర హరికృష్ణ, మెండెం సంతోష్ కుమార్, బయ్యారపు రాజేశ్వరరావు, మేతర అజేయ్ బాబు, కందుల రమేష్ తదితరులు డా. బి.ఆర్. అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు, వారి విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్బంగా విద్యార్ధినీ, విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం సీనియర్ దళిత బహుజన నాయకులు నేతల రమేష్ బాబు, దాసరి నాగేంధ్రకుమారులు ఇన్ చార్జి కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి కి పలు అంశాలకు సంబంధించి వినతిపత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యత్ అంబరీష్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, ఇరిగేషన్ ఎస్ఇ పి. నాగార్జునరావు, సెట్ వెల్ సిఇఓ ప్రభాకరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం. ముక్కంటి, దేవకిదేవి, డిసిహెచ్ డా. పాల్ సతీష్ కుమార్, బి.సి. కార్పోరేషన్ ఈడి ఎన్ పుష్పలత, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, హౌసింగ్ పిడి సత్యనారాయణ, ఐసిడిఎస్ పిడి పి. శారద, పౌర సరఫరాల జిల్లా మేనేజరు శివరామమూర్తి, ఏలూరు తహశీల్దారు శేషగిరిరావు, సీనియర్ దళితనాయకులు లాజరస్, తోకల రాజేష్, కలపాల రవి, దనియాల శంకర్, పలువురు దళితనాయకులు పాల్గొన్నారు.