డెంగీ జ్వరాలపై అవగాహన పోస్టర్ల విడుదల. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

ఏలూరు,జూన్,30: డెంగ్యూ వ్యాధిలక్షణాలు, నివారణ చర్యల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జాతీయ డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా డెంగీ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ముద్రించిన పోస్టర్లను, బ్యానర్లను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాప్తిని అరికట్టడానికి పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అదే విధంగా మురుగునీరు నిల్వలేకుండా చూడాలన్నారు. జిల్లాలో డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ఈ విషయంపై వైద్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకు డెంగ్యూ జ్వరాల పట్ల అవగాహన కల్పిస్తూ డెంగ్యూ దోమ ఆడ ఈడిస్ దోమ మన గృహాలు గృహ బయట ఉండే మంచినీటి నిలవ ప్రాంతాలైన తొట్టెలు మూతలు లేని బావులు, డ్రమ్ములు రుబ్బిరోళ్లు, పోలకుండీలు ఫ్లవర్ వాసులు అలాగే వర్షాకాలంలో వర్షం నీరు ఎక్కడబడితే అక్కడ నిల్వ ఉంటుంది కాబట్టి వర్షం నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమ ఆవాసాలు ఏర్పరచుకుంటా
యన్నారు. కనుక ప్రజలు వారానికి ఒకసారి నీటినిల్వ ప్రాంతాలైనటువంటి తొట్టెలు కడుక్కుని మూతలు పెట్టుకోవాలని వర్షపు నీటి నిలువ ప్రాంతాల్లో వాడేసిన ఇంజన్ ఆయిల్ లేక మట్టితో పూడ్చుకోవాలని, క్విజ్ వెనక బాక్సులో స్పాంజ్ గాని క్లాత్ గాని ఉంచి వారానికోసారి, రెండు సార్లు పిండుకోవాలన్నారు. డెంగ్యూ దోమ పగటిపూట కూడుతుంది కాబట్టి ఇల్లు ఊడ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలతో మూడు టీములుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి డెంగ్యూ దోమలమూలంగాకలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమ లార్వాలను అరికట్టినట్లయితే చాలావరకు డెంగు జ్వరాలు తగ్గుతాయి కాబట్టి సిబ్బంది తప్పనిసరిగా ప్రజలకు దోమ లార్వాలను సోదాహరణగా చూపించి అవగాహన కలిగించాలని సూచించారు. అలాగే పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ శాఖ అధికారులు యాంటీ లార్వా ఆపరేషన్ మరియు ఫాగింగ్ కార్యక్రమం రెగ్యులర్ గా చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. దాత్రి రెడ్డి, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్ మాలిని, జిల్లా మలేరియా అధికారి పిఎస్ ప్రసాద్, ఎన్.టి.ఆర్. ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డా. రాజీవ్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, తదితరులు ఉన్నారు.