తిరుపతిలో జరిగిన శాఫ్ లీగ్స్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి అభినందించారు .
ఏలూరు, మార్చి 02: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం తిరుపతిలో జరిగిన శాఫ్ లీగ్స్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను అభినందించి, ట్రోపీలను, ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి అందజేశారు. తిరుపతిలో జరిగిన శాఫ్ లీగ్స్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో మన జిల్లా నుంచి ఎ.తేజస్విని అండరు-19 విభాగంలో స్వర్ణ పతకం సాధించించారు. అదేవిధంగా అండరు-15 బాలుర విభాగంలో కొల్లా భవన్ రెండవ స్థానం సాధించి రజత పతకం సాధించారు. ఏలూరు వెస్ట్ స్ట్రీట్కు చెందిన ఎ.తేజస్విని సర్ సిఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల్లో రెండవ సంవత్సరం చదువుతోందని, కొల్లా భావన్ నుజివీడులోని కుమార్ సిబిఎస్ఇ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి మాట్లాడుతూ క్రీడల ద్వారా ప్రపంచ స్థాయిలో మన దేశ, రాష్ట్ర కీర్తిని ఇనుమడింపచేసేలా ప్రతిభ కనపరచలన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని క్రీడాకారులకు తెలియజేస్తూ అభినందనలు, తెలిపారు. క్రీడాకారులు కృషికి తల్లిదండ్రులు మరియు శిక్షకులు సహకారం ప్రశంసనీయమని తెలిపారు.
జిల్లా క్రీడా అభివృద్ధికి ఇటువంటి విజయాలు మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, స్ఫూర్తినిస్తాయని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, క్రీడాకారులు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.