Close

తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ కొనియాడారు. అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు జయంతి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశప

Publish Date : 16/03/2026

ఏలూరు, మార్చి , 16 : తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ కొనియాడారు. అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు జయంతి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జేసీ అభిషేక్ గౌడ శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తి ప్రతి తరానికి ఆదర్శమని, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సేవా భావం, నిస్వార్థ త్యాగం వంటి విలువలను ఆయన చూపిన మార్గంలో కొనసాగించాలని అన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ ఆంధ్రుల ఉనికిని జాతీయ స్థాయిలో చాటి చెప్పి, భాషా ప్రయోక్త రాష్ట్రంగా ఏర్పడడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని, ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. .1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు సత్య, అహింస, హరిజనోద్దరణ ఆశయాలు కోసం జీవితాంతం కృషిచేసిన మహానీయులన్నారు.
జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, సహాయ పర్యాటకాధికారి పట్టాభి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఆర్య వైశ్య సంఘ నాయకులు నంగులూరి సత్యనారాయణ, బ్రహ్మయ్య, గూడవల్లి శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పాల్గొన్న శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.