Close

దివ్యాంగుల వద్దకే వెళ్లి వారి నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

Publish Date : 05/05/2025

ఏలూరు,మే 5:అర్జీదారుల సమస్య
లను పరిష్కరించడమే కాకుండా వారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు.

ఏలూరు కలెక్టరేట్‌ గోదావరి సమావేశం మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 226 దరఖాస్తులు స్వీకరించారు. వివిధ ప్రతిభావంతులు, దివ్యాంగులు వద్దకు వేదిక పైనుంచి కిందికి వచ్చి కలెక్టర్ వెట్రిసెల్వి అర్జీలు స్వీకరించి, వారి సావధానంగా విని వాటి పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వారితో పాటు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి. విశ్వేశ్వరరావు, ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, డీఆర్‌డీఏ పీడీ అర్.విజయరాజు,ఎస్ సి కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్ వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజలు అందించే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టిసారించి అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

అందిన అర్జీలు కొన్ని:
పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామానికి చెందిన కొమ్మిన వెంకటేశ్వరరావు తమ
భూసమస్యపై అర్జీని అందజేసి పరిష్కారం తీసుకోవాలని కోరారు. ఏలూరు హనుమాన్ నగర్ కి చెందిన కుక్కర రమాదేవి అర్జీనిస్తూ తన భర్త నరసింహారావు ఆనారోగ్యంతో మరణించినందున తన జీవనోపాధి కోసం పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. భీమడోలు మండలం ఎం.ఎం.పురంకు చెందిన బుంగ చందర్రావు అర్జీనిస్తూ తన చేపల చెరువుకు సంబంధించి తనకు ఉన్న భూమి కన్నా తక్కువ ఆన్లైన్ లో నమోదు అయిందని ఈ విషయాన్ని పరిశీలించి మొత్తం భూమి ఆన్లైన్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలను కోరారు. కైకలూరు మండలం ఆలపాడు చెందిన సుందర కనకదుర్గ అర్జీనిస్తూ తమ భూమి అడంగల్ నందు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏలూరు పవర్ పేటకు చెందిన పిల్ల హరి నారాయణ రావు అర్జీనిస్తూ దెందులూరు మండలం సోమవార్పడు లో భీష్మ పూరి కాలనీలో తమ ఫ్లాట్ సర్వే చేసి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.