Close

దెందులూరులో జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో మమేకమై వారి విద్యా ప్రగతిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 05/12/2025

దెందులూరు/ఏలూరు, డిసెంబర్, 5 : సమాజంలో విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో మమేకమై వారి విద్యా ప్రగతిని స్వయంగా పరిశీలించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల అభ్యాసన సామర్ధ్యాన్ని పరిశీలించి మరింత మెరుగైన బోధన చేయాలనీ ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ
చిన్నతనం నుండి ఇష్టపడి విద్యను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్తు మన సొంతం అవుతుందని, ప్రతీ విద్యార్థి ఇష్టంతో కస్టపడి చదివి కలలను సాకారం చేసుకుని ఉన్నతస్థానాలు పొందాలన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేయూతను ఇస్తున్నదని, తల్లికి వందనం పధకం కింద తల్లులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నదని , పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ , బూట్లు, ఉచితంగా అందించడంతోపాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నదన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి తీసుకున్న పధకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నతశిఖరాలు సాధించాలన్నారు. తల్లులు తమ పిల్లలకోసం చేస్తున్న త్యాగాలను గుర్తించి విద్యార్ధులు ఇష్టపడి కష్టపడి చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ కల్పించుకోవాలన్నారు. తమ పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారు,వారి ప్రవర్తన ఎలా ఉంది,సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారా లేదా ఇలా అనేక అంశాలపై తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించడమే మెగా పిటియం లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలను,సూచనలను ఈ వేదిక ద్వారా ప్రభుత్వంతో పంచుకునే అవకాశం లభిస్తుందన్నారు.

అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ ప్రీ స్కూల్ లో కలెక్టర్ వెట్రిసెల్వి పిల్లలతో సరదాగా గడిపారు.

కార్యక్రమంలో జిల్లా విద్య శాఖాధికారి వెంకటలక్ష్మమ్మ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ ఐసిడిఎస్ శారద, జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి, తహసీల్దార్ సుమతి, ఎంఈఓ ఏ .వి. ఎన్ .వి. ప్రసాద్, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్, సర్పంచ్ తోట ఏసమ్మ ప్రభృతులు పాల్గొన్నారు.