Close

దెందులూరు నియోజకవర్గంలో వెల్లువెత్తిన స్వచ్ఛత స్ఫూర్తి – దుగ్గిరాల, వట్లూరు, దెందులూరు, చాటపర్రు గ్రామాల్లో ఉత్సాహంగా సాగిన క్లీన్ & గ్రీన్ విలేజ్ కార్యక్రమం

Publish Date : 21/11/2025

దెందులూరు నియోజకవర్గంలో వెల్లువెత్తిన స్వచ్ఛత స్ఫూర్తి – దుగ్గిరాల, వట్లూరు, దెందులూరు, చాటపర్రు గ్రామాల్లో ఉత్సాహంగా సాగిన క్లీన్ & గ్రీన్ విలేజ్ కార్యక్రమం – ముఖ్య అతిథులుగా పాల్గొని స్వయంగా వీధులను శుభ్రం చేస్తూ, మొక్కలు నాటుతూ, పారిశుధ్య కార్మికులను సత్కరిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో స్వచ్ఛత స్ఫూర్తిని ప్రజల్లో నింపిన రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభి గారు, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రీ సెల్వీ గారు, బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు, జిల్లా పంచాయతీ అధికారి అనురాధ గారు, సహా పలువురు ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది..

– పెదపాడు మండలం వట్లూరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రూ.30 లక్షల రూపాయల స్వచ భారత్ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (40 బాలికల టాయిలెట్స్) ను ప్రారంభం – దెందులూరులో వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అవసరమైన షెడ్స్ నిర్మాణానికి చర్యలు – కొబ్బరి వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు మరో షెడ్ ఏర్పాటుకు చర్యలు – గత టిడిపి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చెత్త సేకరణలో భాగస్వామ్యం అయ్యి వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఏలూరు మార్కెట్ యార్డ్ లో నిరుపయోగంగా మూలన పడేసి ఉన్న 80 కెనటిక్ వాహనాలను స్వచ్ఛంద కార్పొరేషన్ శ్రీ కామారెడ్డి పట్టాభి గారితో కలిసి పరిశీలించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు గ్రామాల్లో చెత్త సేకరణ తరలింపునకు సదరు యంత్రాలను మరమ్మత్తులు చేసి తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారిని కోరిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు..

“క్లీన్ & గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలలో ఉత్సాహంగా సాగుతున్న గ్రామ పరిశుభ్రత కార్యక్రమాలు

దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి గారు, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వీ గారు, జిల్లా పంచాయతీ అధికారి అనురాధ గారు సహా పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాల్గొని క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు..

దెందులూరు నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల వారీగా పెదవేగి మండలానికి చెంది దుగ్గిరాల గ్రామంలో, పెదపాడు మండలానికి చెంది వట్లూరు గ్రామంలో, దెందులూరు మండలానికి చెందిన దెందులూరు గ్రామంలో, ఏలూరు రూరల్ మండలానికి సంబంధించి చాటపర్రు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఉత్సాహంగా జరుగుతున్న క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం

కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని వీధులను శుభ్రం చేయడం, చెత్తను ఏరీవేయడం, మొక్కలు నాటడం, వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించడం, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించడం, స్వచ్ఛతపై ర్యాలీలు నిర్వహిస్తూ, గ్రామస్తులకు కార్యక్రమం ఆవశ్యకతను వివరించడం, ప్లాస్టిక్ వ్యర్ధాలను భూమిలో కలవకుండా చెత్త సేకరించే అంశాలపై , గ్రామాలను శుభ్రత పరిశుభ్రత గా ఉంచడంతోపాటు మరింత పచ్చదనంగా ఉంచే అంశాలను ప్రజలకు వివరించిన కార్యక్రమ అతిథులు