దెందులూరు నియోజకవర్గంలో పలు సమస్యలను శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తీసుకొచ్చారు.
Publish Date : 19/05/2026
ఏలూరు, మే, 19: దెందులూరు నియోజకవర్గంలో పలు సమస్యలను శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తీసుకొచ్చారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలోని ఓవర్ హెడ్ రిజర్వాయర్ పైకి చేరుకునే మెట్లు మార్గాలు పలుచోట్ల అద్వాన్న స్థితిలో ఉన్నాయని వాటి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పలు గ్రామాలలోని రక్షిత మంచినీటి పధకాలలో ఫిల్టర్ బెడ్స్ మార్చాలని, గ్రామాలలో ప్రస్తుత వేసవిలో ఎటువంటి త్రాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరారు. శాసనసభ్యులు తెలియజేసిన సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.