Close

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ ను కలిసి ఏలూరు కృష్ణా కాలువకు అండర్ టన్నెల్ నిర్మాణం కారణంగా కృష్ణా కాలువకు నీరు నిలుపుదల కారణంగా త్రాగునీటి ఎద్దడి ఎదురయ్యే పరిస

Publish Date : 08/12/2025

ఏలూరు, డిసెంబర్, 8 : దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ ను కలిసి ఏలూరు కృష్ణా కాలువకు అండర్ టన్నెల్ నిర్మాణం కారణంగా కృష్ణా కాలువకు నీరు నిలుపుదల కారణంగా త్రాగునీటి ఎద్దడి ఎదురయ్యే పరిస్థితి వస్తుందని, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారు. ఏలూరు కృష్ణా కాలువకు 12 కి.మీ. వద్ద అండర్ టన్నెల్ నిర్మాణం నిమిత్తం రానున్న జనవరి, 1 వతేదీ నుండి జూన్ వరకు అనగా ఆరు నెలలపాటు నీరు విడుదల నిలిపి వేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారని, దీని కారణంగా పెదపాడు, ఏలూరు మండలాల్లో ఇప్పటి నుండి కాబోయే వేసవి వరకు ప్రజలకు తీవ్ర త్రాగునీరు సమస్య ఏర్పడుతుందని, పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ నుండి నీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే జేసీ ని కోరారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులను తగు సూచనలు జారీచేయవలసిందిగా చింతమనేని ప్రభాకర్ జాయింట్ కలెక్టర్ ని కోరారు. సదరు సమస్య పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.