ద్వారతిరుమల ఆలయంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్వామి వారి దర్శనం అనంతరం దేవాలయంలో భక్తులకు దేవస్థానం అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు.
ద్వారకాతిరుమల/ ఏలూరు, నవంబర్, 2 : ద్వారతిరుమల ఆలయంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్వామి వారి దర్శనం అనంతరం దేవాలయంలో భక్తులకు దేవస్థానం అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా చూడాలన్నారు. భక్తులకు అన్న ప్రసాదం సరైన నాణ్యతతో ఉండేలా చూడాలని, వంటశాలలో పూర్తి పరిశుభ్రతతో ఉండేలా ఆలయ అధికారులు పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయంలోని సౌకర్యాలను గురించి, దర్శనంనకు పట్టే సమయం, ఆలయ సిబ్బంది ప్రవర్తన తదితర అంశాలపై పలువురు భక్తులను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్న ప్రసాదశాలకు చేరుకొని , వంటశాల పరిశుభ్రత, అన్న ప్రసాదం వడ్డించే తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
కలెక్టర్ వెంట ఆలయ ఈఓ , తహసీల్దార్, ప్రభృతులు పాల్గొన్నారు.