ధరఖాస్తు చేసిన ప్రతి అర్జీని శాఖపరమైన అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి.
ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించే విధంగా నెలలో ప్రతి మూడవ శుక్రవారం జిల్లా స్థాయీ “ఎంప్లాయిస్ గ్రీవెన్స్ డే” నిర్వహించటం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు గ్రీవెన్స్ డే పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమం, వారి సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నెలలో ప్రతి మూడవ శుక్రవారం జిల్లా స్థాయీ “ఎంప్లాయిస్ గ్రీవెన్స్ డే” ద్వారా పరిష్కారం పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగులు సంక్షేమం, సేవా భద్రత, పదోన్నతులు, బదిలీలు, ఇతర పరిపాలనా అంశాలుపై వచ్చిన వినతులను పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రతి ఉద్యోగి తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రభుత్వ జిల్లాస్థాయి అధికారులు ఉద్యోగులు గ్రీవెన్స్ డే కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను శాఖలు వారీగా సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చెయ్యుటలో కాలయాపన చేయరాదని, ధరఖాస్తు సమర్పించిన ప్రతి ఉద్యోగికి సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.
ఈ రోజు గ్రీవెన్స్ డేలో వచ్చిన అర్జీలలో కొన్ని.
చింతలపూడి మండలం యర్రగుంటపల్లి ప్రభుత్వ బిసి బాలురు వసతి గృహ హాస్టల్ వెల్ఫేర్ అధికారి బి.శశి కుమార్ తన సస్పెన్షన్ రద్దు చెయ్యాలని కోరారు,
ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి జిల్లా పరిషత్తు+1 స్కూలు అసిస్టెంటు (పిడి) పెండింగులో ఉన్న ఇంక్రిమెంటు మంజూరు చెయ్యాలని అర్జీని సమర్పించారు, ఏలూరు జిల్లా ప్రజా పరిషత్తు ఏవో కె.కనకరాజు నోషనల్ ప్రమోషన్ మరియు పే ఫిక్సేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చెయ్యాలని కోరారు, కుక్కునూరు మండలం కుక్కునూరు గ్రామపంచాయతీ కార్యదర్శి వి.వి.యన్. ఆంజనేయులు తనపై ఉన్న సస్పెన్షన్ రద్దు చెయ్యాలని కోరారు.
కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి.నాగసాయమ్మ గ్రేడ్-1 ప్రమోషన్, 6,8,16 సంవత్సరాలు పెండింగులో ఉన్న ఇంక్రిమెంట్లు మంజూరు చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవ కిదేవి, గృహ నిర్మాణ శాఖ డిడి జి.సత్యనారాయణ, జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె.అనురాధ, ఏపి యన్ జిజి వో జిల్లా ప్రెసిడెంటు చోడగిరి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్తు ఏవో కె.జాన్సన్, ఏవో యన్.వి. నాంచారయ్య, జిల్లా కలెక్టరేట్ సూపర్డెంట్లు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.