Close

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలకు సొమ్ము జమ. జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి.

Publish Date : 21/11/2024

ఏలూరు, నవంబరు, 21: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలలోపు వారి ఖాతాలకు సొమ్ము జమచేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. స్ధానిక కలెక్టరేట్ లోని జెసి ఛాంబర్ లో గురువారం ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాలు, సహకార, మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వారి సమీప రైతు సేవా కేంద్రమును సంప్రదిస్తే ధాన్యం కోనుగోలు కేంద్రంలోని పనిచేయు సిబ్బంది స్వయంగా కళ్లాల వద్దకు వచ్చి ధాన్యాన్ని పరీక్షించి నియమ నిభంధనల ప్రకారం ధాన్యము ఉన్నచో ప్రభుత్వం వారిచే కల్పిచు అన్నీ సౌకర్యములతో రైతు కోరిన రైస్ మిల్లుకు తరిలించడం జరుగుతుందన్నారు. అట్లు తరలించినట్లు రైస్ మిల్లరు దృవీకరించిన 48 గంటలలోపు రైతు అధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలో ధాన్యం సొమ్ము రైతులకు చెల్లింపు జరుగుతుందన్నారు. జిల్లాలో 250 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశామన్నారు. గత నెల 22వ తేదీ నుండి నేటి వరకు 136.44 కోట్ల రూపాయలు విలువైన 58,102.800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేసి నమీపములోని రైస్ మిల్లుకు తరలించడం జరిగిందన్నారు.
ఏలూరు జిల్లాలోని రైతు సేవా కేంద్రములలో పని చేయు సిబ్బంది సాయంత్రము 6.00 గంటలు దాటిన తరువాత ఆరోజునకు సంబంధించి ఏటువంటి ట్రక్ షీట్ జనరేట్ చేయవద్దని మరియు సదరు ధాన్యమును కోనుగోలు చేయుటకు సంభంధించి అన్ లైన్ ప్రోక్యూర్మెంటును ప్రక్రియను ఉదయం 5.00 గంటల నుండి ప్రారంభించవచ్చన్నారు. అందువల్ల రైతులు, రవాణాదారులు మిల్లు వద్ద రాత్రి అంతయు ధాన్యమును దించు కొనుటకు వేచియుండవలసిన అవసరము ఉండదని తెలిపారు.
రైతుల ధాన్యము రైస్ మిల్లుకు చేరుకోవడానికి అవసరమైన అంచనా సమయం రవాణా కాబడిన సమయం నుండి దూరం నిర్ణయించడం జరిగిందన్నారు. అట్టి విధముగా సమయపాలన చేయచు సకాలంములో రైతుల దాన్యమును దిగుమతి కాబడే విధముగా తగు హమాలిలను మరియు ఇతర అవసరమైన అన్ని ఏర్పట్లు ఉండేలా చూసుకొనవలసిదిగాను జిల్లాలోని రైస్ మిల్లర్లు తగు జాగ్రత్త వహించాలని తెలిపారు.
టన్నేజి / దూరం 10 KMs 20 KMs 40 KW
10 మెట్రక్ టన్నులకు 3 గంటలు 4 గంటలు 5 గంటలు
10 నుండి 20యంటి 4 గంటలు 5 గంటలు 6 గంటలు
20 నుండి30 యంటి పైబడి 5 గంటలు 6 గంటలు 7 గంటలు
40 కి.మీ.ల కంటే ఏక్కువ ఉన్నచో ప్రతి 10 కి.మీ.ల అదనపు దూరానికి అర గంట (½గం) కలుపుకోనవలసిదిగా తెలిపారు. రైతులు వారు పండించిన ధాన్యం కోతలు అయిన తరువాత ఆరబెట్టుకొని నాణ్యతా ప్రమాణములను పాటించవలసిందిగా కోరారు. ధాన్యములో తాలు, తప్పలు మొదలైన వ్యర్ద పదార్దములు1 శాతం చెడిపొయిన, రంగుమారిన మొలకెత్తిన పురుగుతిన్న ధాన్యం 5 శాతం అపరిపక్వ, కుంచించుకుపోయిన మరియు ముడుచుకున్న గింజలు3శాతం
తక్కువ శ్రేణి ధాన్యం గింజలు 6 శాతం, తేమ శాతం 17 వంటి భారత ప్రభుత్వము వారిచే నిర్ధేశించిన అన్ని నాణ్యతా ప్రమాణములకు అనుగుణముగా సిధ్దం చేసుకొని కనీస మద్దతు ధర పొందాలన్నారు. క్వింటాలుకు కామన్ రకమునకు రూ. 2300 /- మరియు గ్రేడ్–A రకమునకు రూ.2203/- బయోమెట్రిక్ విధానములో తమ యొక్క వేలిముద్రను వేసి ప్రభుత్వము వారికి విక్రయించుకొవచ్చన్నారు. షెడ్యూలింగ్ చేయబడిన రైతుల యెక్క ధాన్యo సకాలములో కొనుగోలు చేయాలి ధాన్యం కొనుగోలు చేయుటకు అవసరమైన గోనే సంచులు సిద్దముగా ఉంచుకొవాలన్నారు.
రైస్ మిల్లులలో ఎవరైనా ధాన్యం దిగుమతి చేసుటకు గాని డబ్బులు లేదా ఎక్కువ ధాన్యo అడిగినా మరియు ధాన్యం కొనుగోలు విధానములో రవాణా వాహనానికి అమర్చిన GPS పరికరము వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కున్నచొ మరియు ధాన్యం కొనుగోలునకు సంబంధించి రైతులకు ఎటువంటి సందేహములు ఉన్నా మరియు వారి యొక్క ఫిర్యాదులను చేయుట కొరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ (కంట్రోల్ రూమ్ నెంబర్లు 08812-230448, 7702003584, మరియు టోల్ ఫ్రీ
18004256453)నకు కాల్ చేయవచ్చన్నారు.