నాటుసారా తయారీ విక్రయాలపై 14405 టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారం అందించాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

ఏలూరు, జూలై, 01: జిల్లాలో గుర్తించబడిన 140 గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు పూర్తిగా నిర్మూలన జరిగినందున ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించారు. ఈ సందర్బంగా మంగళవారం స్దానిక కలెక్టరేట్ లో సంబంధిత పోస్టర్లను కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గుర్తించబడిన 140 గ్రామాల్లో నాటుసారా తయారీ పూర్తిగా నిర్మూలనకు సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా గత 4 నెలలు కాలంలో జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోపోలీస్, రెవిన్యూ, తదితర శాఖల అధికారుల సహకారంతో నాటుసారా తయారీదారులను, వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని అవగాహన కల్పించడం నాటుసారా నిర్మూలనకు చర్యలు తీసుకోవడం, నాటుసారా తయారీదారులకు ప్రత్యమ్నాయ ఉపాధి కల్పించడం తదితర చర్యలు తీసుకోవడం ద్వారా నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు అవకాశం కలిగిందన్నారు. అయితే జిల్లాలో ఎక్కడా నాటుసారా తయారీ వినియోగం జరుగకుండా నిరంతరం మానటరింగ్ చేసినపుడే ఈకల సంపూర్ణంగా సాకారం అవుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఇకపై గుర్తించిన 140 గ్రామాల్లో కానీ, జిల్లాలో ఇతర గ్రామాల్లో నాటుసారా తయారుచేసినా, అమ్మిన వారిపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో జిల్లాలో మరేప్రాంతంలో కూడా నాటుసారా అమ్మకాలు, తయారీ, పూర్తిగా లేకుండా నిరంతర దాడులు నిర్వహించాలని, ప్రజల్లో నాటుసారా పై పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రజల్లోకి టోల్ ఫ్రీ నెంబరు 14405 సమాచారం ఇచ్చేందుకు విస్త్రృత ప్రచారం కల్పించాలన్నారు.మద్యం దుకాణాల వద్ద,ఇతర ప్రాంతాల్లో సంబంధిత బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు.ప్రజలు కూడా నాటుసారా తయారీ, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 14405 టోల్ ఫీ నెంబరుకు సమాచారం అందించాలన్నారు. నాటుసారా నిర్మూలనకై ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమం కింద అర్హులైన 40 మంది లబ్దిదారులకు రూ. 31.40 లక్షలు రుణాలను అందజేశామన్నారు.ఇందుకు సంబంధించి రీహబిలిటేషన్ కార్యక్రమాల కొనసాగింపు,అమలు తీరును సమీక్షేందుకు నెలవారీ సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
సమావేశంలో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కె.వి.ఎస్. ప్రభుకుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. ఆవులయ్య, ఏలూరు డిఎస్పీ డి.శ్రావణ్ కుమార్, ఎక్సైజ్ శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.