నూజివీడు డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధిపథంలో ముందు నిలిపేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న కు చెప్పారు.
ఏలూరు/నూజివీడు, ఫిబ్రవరి, 18 : నూజివీడు డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధిపథంలో ముందు నిలిపేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న కు చెప్పారు. బుధవారం నూజివీడు నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ తో పలు అంశాలను కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యా, వైద్యంతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న నిర్మాణ పనులు, పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపు, ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యులకు మెరుగైన వైద్య సౌకర్యాలు, వసతి గృహాల నిర్వహణ, వివిధ ప్రభుత్వ పధకాలు అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బందిలో జవాబుదారీతనం పెంచాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే పధకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని కలెక్టర్ చెప్పారు.